AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సేంద్రియ పద్దతిలో జెర్బెరా పూల మొక్కల సాగు
సేంద్రీయ వ్యవసాయంఅగ్రోవన్
సేంద్రియ పద్దతిలో జెర్బెరా పూల మొక్కల సాగు
జెర్బెరా పూలు ఆకర్షణీయంగా ఉండడమే కాక మరియు దీర్ఘాయువు కలిగి ఉంటాయి. కావున, వివాహ వేడుకలు మరియు పూల బొకేలలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ పువ్వులకు ఉన్న డిమాండ్ కారణంగా, వీటికి మార్కెట్ ఎక్కువగా ఉంది మరియు మంచి రేటు ఉంది, ఫలితంగా రోజులు గడిచేకొద్దీ పువ్వుల సాగు పెరుగుతుంది. పంటలో బాక్టీరియల్ ఎరువులు ఉపయోగించడం 500 గ్రాముల అజోస్పైరిల్లమ్, 500 గ్రాముల ఫాస్పరస్ సోల్యూబిలైసింగ్ బ్యాక్టీరియా, ట్రైకోడెర్మా 500 గ్రాములు / 10 కిలోల పశువుల ఎరువుకు కలిపి, ప్లాస్టిక్ కవర్ ను 8-10 రోజులు పాటు ఎరువు మీద పరచి ఉంచండి. ఆ తరువాత, జెర్బెరా మొక్కలను పాలీహౌస్లో నాటిన మూడు వారాలకు ఎరువును మొక్కలకు ఇవ్వండి. వ్యాధి కారక జీవులు తెగులు ప్రారంభ దశలో, శిలీంధ్ర సంక్రమణ కారణంగా వేర్లు లేదా కాండం కుళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మొక్కను రైజోక్టోనియా, ఫ్యూసేరియం, పితియం , ఫైటోఫ్తోరా మరియు స్క్లెరోసిస్ అను వ్యాధికారక శిలీంధ్రాలు సంక్రమిస్తాయి. వ్యాధి కారక లక్షణాలు వ్యాధి కారణంగా, నర్సరీలో మొలకలు చనిపోతాయి. ఫంగస్ సాధారణంగా సాగు తర్వాత భూమిలో పెరుగుతుంది మరియు మొత్తం ప్రాంతం ఎండిపోయేలా చేస్తుంది; దీనివల్ల మొక్క కూడా కాలక్రమేణా ఎండిపోతుంది. పొలంలో సరైన నీటి పారుదల వసతి లేనట్లయితే మరియు అధిక తేమ ఉన్నట్లయితే వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతుంది. పరిష్కారం • మొక్కలను నాటడానికి ముందు మట్టిలోని రోగకారక క్రిములను నాశనం చేయండి. రోగకారక క్రిములను నాశనం చేసిన 7-10 రోజుల తరువాత మొక్కలను నాటడం చేయాలి. • ఆరోగ్యకరమైన మొక్కలను నాటండి. • ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్, జీవ శిలీంద్ర నాశిని 500 గ్రాములు / 10 కిలోల పశువుల ఎరువుకు విడిగా కలిపి, మొక్కలను నాటడానికి ముందు వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగించండి. • నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి మరియు నేలలోని తేమ శాతాన్ని గమనించండి. హెచ్చరిక మొక్క యొక్క వేర్ల చుట్టూ తయారు చేసిన ద్రావణాన్ని ప్రతి నెల ఇవ్వండి. సిఫారస్సు చేయబడిన మోతాదులో ఎరువులను ఇవ్వండి. రెఫరెన్స్ : అగ్రోవన్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
285
0