AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వేసవి కాలం నువ్వుల పంటలో లీఫ్ వెబెర్ / ఆకు చుట్టు పురుగు/ కాయ తొలుచు పురుగు నియంత్రణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేసవి కాలం నువ్వుల పంటలో లీఫ్ వెబెర్ / ఆకు చుట్టు పురుగు/ కాయ తొలుచు పురుగు నియంత్రణ
లీఫ్ వెబెర్ / ఆకు చుట్టు పురుగు/ కాయ తొలుచు పురుగు నియంత్రణ విధానాలు: • వానాకాలంలో మరియు వేసవి కాలంలో నువ్వుల పంటను వేయవచ్చు. • సాధారణంగా గాల్ ఫ్లై, ఆకు చుట్టు పురుగు, హాక్ మాత్ పురుగు, దోమ మరియు పేనుబంక వేసవి కాలంలో పండించే నువ్వుల పంటకి నష్టాన్ని కలిగిస్తాయి. • చిన్న లార్వా కొన్ని ఆకులను కలిపి, వాటిని చుట్టి వాటి లోపల జీవిస్తాయి. • రైతు దీనిని "హెడ్ టైడ్ లార్వా" అని కూడా పిలుస్తారు. • మొక్క పుష్పించే సమయంలో లార్వా పువ్వులు మరియు మొగ్గలను కూడా తింటుంది. • దెబ్బతిన్న మొగ్గ నుండి కాయ ఏర్పడదు మరియు అలాంటి భాగం నుండి కాయలు రావు.
• పంట యొక్క తరువాతి దశలో, లార్వా కాయలోకి ప్రవేశించి కాయ లోపల ఉన్న అంతర్గత భాగాలను తింటుంది._x000D_ • ఈ దశలో, దీనిని కాయ తొలుచు పురుగు అని పిలుస్తారు._x000D_ • పూత దశలో మరియు కాయ ఏర్పడే దశలో పురుగు ముట్టడి ఉన్నట్లయితే ఆర్థిక నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది._x000D_ • కొన్ని పరాన్నజీవులతో ఈ పురుగును సహజంగా నియంత్రించవచ్చు._x000D_ • ఆఫ్ సీజన్లో, ఈ తెగులు పెడాలియం మ్యూరెక్స్ లిన్న్ అనే కలుపు మొక్కలపై మనుగడ సాగిస్తుంది. అందువల్ల, పంట కాలంలో మరియు పంట తర్వాత కూడా అటువంటి కలుపు మొక్కలను క్రమానుగతంగా తొలగించి నాశనం చేయండి._x000D_ • వయోజన పురుగులను నియంత్రించడానికి పొలంలో విత్తనాలు విత్తిన తరువాత దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి._x000D_ • తెగులు యొక్క ప్రారంభ దశలో, బ్యూవేరియా బస్సియానా @ 40 గ్రాములు లేదా వేప విత్తన పొడి 500 (5% సస్పెన్షన్) లేదా ఏదైనా వేప ఆధారిత పురుగుమందులు @ 20 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ • క్వినాల్ఫోస్ 20 ఇసి 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి విత్తనం విత్తిన 10, 30, 45 మరియు 60 రోజుల వ్యవధిలో మొక్కల మీద పిచికారీ చేయాలి. _x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
30
0