AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వరిలో కాండం తొలుచు పురుగు నిర్వహణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వరిలో కాండం తొలుచు పురుగు నిర్వహణ
వరి సాగుకు వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం కాబట్టి భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలకు వరి ప్రధాన పంట. అధిక తేమ, సుదీర్ఘ సూర్యరశ్మి మరియు సురక్షితమైన నీటి సరఫరా ఉన్న ప్రాంతాలు వరి సాగుకు అనుకూలమైనవి. పంట జీవితకాలమంతా అవసరమైన సగటు ఉష్ణోగ్రత 21ºC నుండి 37ºC వరకు ఉంటుంది. పంట తట్టుకోగల గరిష్ట ఉష్ణోగ్రత 40ºC నుండి 42ºC మధ్య ఉంటుంది. విత్తనం మొలకెత్తడానికి 10 ºC కనిష్ట ఉష్ణోగ్రత మరియు పిలకలు వచ్చే సమయంలో మరియు పంట పెరుగుదల సమయంలో అధిక ఉష్ణోగ్రత అవసరం.
• ముందుగా నాట్లు వేయడం అంటే జూలై మొదటి పక్షం._x000D_ • 3-4 దఫాలుగా నత్రజని ఎరువులు వేయండి._x000D_ • నర్సరీలో, క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% జిఆర్ లేదా కార్బోఫ్యూరాన్ 3% జి లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4% జి లేదా ఫిప్రోనిల్ 0.3 జిఆర్ @ 1 కిలో ఇసుకతో కలిపి 100 చదరపు మీ. (ఒక గుంటా) నర్సరీలో విత్తిన 15 రోజుల తరువాత ఇవ్వండి. _x000D_ • వరి మొక్కల చివరలు కత్తిరించడం వలన తల్లి పురుగు మొక్కల మీద గుడ్లు పెట్టడం తగ్గుతుంది._x000D_ • కాండం తొలుచు పురుగుల లార్వా దశలను నియంత్రించడానికి గ్రాన్యులార్ పురుగుమందులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి._x000D_ • క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% జిఆర్ @ 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4% జి @ 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3% జిఆర్ @ 20-25 కిలోలు హెక్టారుకు రెండుసార్లు వరి పొలంలో మొదట తెగులు ఆశించిన దశలో లేదా నాట్లు వేసిన 30-35 రోజుల తరువాత మరియు మొదటి వాడిన 15-20 రోజుల తర్వాత రెండవ సారి పిచికారి చేయాలి._x000D_ • పురుగుమందులను పురుగు సోకిన ప్రాంతానికి మాత్రమే వాడండి._x000D_ • అదనంగా, క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% ఎస్సి @ 3 మి.లీ లేదా ఫ్లూబెండమైడ్ 480 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఫిప్రోనిల్ 80% డబ్ల్యుజి @ 1 గ్రా లేదా ఫ్లూబెండియమైడ్ 20% డబ్ల్యుజి @ 2.5 గ్రా లేదా ఫ్లూబెండమైడ్ 4% + బుప్రోఫెజిన్ 20% ఎస్సి @ 10 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
216
2