AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వంకాయను ప్రధాన క్షేత్రంలో నాటడానికి ముందు ఈ జాగ్రత్తలను పరిగణించండి.
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వంకాయను ప్రధాన క్షేత్రంలో నాటడానికి ముందు ఈ జాగ్రత్తలను పరిగణించండి.
వంకాయను సాధారణంగా ఏడాది పొడవునా సాగు చేస్తారు. సవాలు ఏమిటంటే, పేనుబంక , దోమ, తెల్ల దోమ, నల్లి వంటి రసం పీల్చు పురుగులు మరియు కాండం మరియు కాయ తొలుచు పురుగులు ఈ పంటను సంక్రమిస్తాయి. వెర్రి తెగులు(లిటిల్ లీఫ్) అనే వైరల్ వ్యాధి కూడా కనిపిస్తుంది, ఈ వైరస్ మొక్కను ఆశించడం వల్ల మొక్కలకు పూత మరియు పిందె రాదు. మొక్కలను ప్రధాన పొలంలో నాటే సమయంలో, ఆరోగ్యకరమైన పంట మరియు అధిక ఉత్పత్తిని పొందడానికి మొక్క ప్రారంభ దశలో ఉన్నప్పుడు క్రింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి
• దీర్ఘచతురస్రాకార పండ్ల కలిగిన రకం కన్నా గుండ్రని వంకాయలు కలిగిన రకాన్ని పురుగులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీర్ఘచతురస్రాకార రకాలను ఎంచుకోవాలి._x000D_ • సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో నాటిన పంటపై పురుగులు తక్కువ ప్రభావం చూపుతాయి._x000D_ • కొత్త పంటను నాటడానికి ముందు మునుపటి పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి. పంట యొక్క అవశేషాలను గట్లపై పేర్చవద్దు. అవసరమైతే వాటిని ప్లాస్టిక్ నెట్ తో కప్పండి మరియు ఫ్రూట్ బోర్ యొక్క ఒక ఫెరోమోన్ ఉచ్చును నెట్ లోపల ఉంచండి._x000D_ • నెట్ క్రింద లేదా ప్లాస్టిక్ నెట్ క్రింద మొక్కలను పెంచే నర్సరీ నుండి మొక్కలను ఎంచుకోండి._x000D_ • మొక్కలు ప్రధాన పొలంలో నాటే 2-3 రోజుల ముందు నర్సరీకి కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను @ ౩ కిలోలు ఒక గుంట చొప్పున ఇవ్వండి._x000D_ • మట్టి యొక్క రకాన్ని బట్టి రెండు వరుసల మరియు రెండు మొక్కల మధ్య దూరాన్ని నిర్ణయించండి._x000D_ • ప్రధాన పొలంలో నాటడానికి గాను ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోండి._x000D_ • మట్టిలో వ్యాప్తి చేయడానికి బదులుగా సిఫార్సు చేసిన ఎరువులను మొక్క యొక్క వరుసలకు ఇవ్వండి._x000D_ • పురుగుతో పాటు దెబ్బతిన్న కొమ్మలను సేకరించి నాశనం చేయండి లేదా మట్టిలో పాతిపెట్టండి._x000D_ • కాయ మరియు కాండం తొలుచు పురుగు యొక్క ఉనికిని పర్యవేక్షించడానికి రెండు వోటా ఉచ్చులను ఏర్పాటు చేయండి._x000D_ • కాండం మరియు కాయ తొలుచు పురుగు యొక్క పరాన్నజీవి (ట్రెథెలా) యొక్క లార్వా 55% కంటే ఎక్కువగా ఉంటే పంటపై వేప ఆధారిత పురుగుమందులను ఉపయోగించి వాటిని సంరక్షించండి._x000D_ • కాండం మరియు కాయ తొలుచు పురుగు యొక్క ముట్టడి గమనించినట్లయితే, వేప, సీతాఫలం లేదా తలంబ్రాల చెట్టు యొక్క ఆకు సారం @ 10% మరియు 20% ఆవు మూత్రాన్ని కలిపి మొక్కలకు ఇవ్వండి._x000D_ • వెర్రి తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి నాశనం చేయండి._x000D_ • కాండం యొక్క నష్టం పెరిగినప్పుడు, క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సి @ 10 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 డబ్ల్యుజి @ 4 గ్రాములు లేదా థియోడికార్బ్ 75 డబ్ల్యుపి @ 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
250
0