AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మీ పంటలకు సల్ఫర్ అవసరం
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మీ పంటలకు సల్ఫర్ అవసరం
• మొక్కకు బాగా అవసరమైన పోషకాలలో సల్ఫర్ ఒకటి. • దీనిని శిలీంద్రనాశినిగా మరియు పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు. • పంట పెరుగుదల మరియు అభివృద్ధికి సల్ఫర్ ముఖ్యం, ఎందుకంటే ఇది కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది.
సల్ఫర్ యొక్క ప్రయోజనాలు: • సల్ఫర్ కారాన్ని, నూనె శాతాన్ని, వాసన, ప్రోటీన్ మరియు చక్కెర శాతాన్ని పెంచుతుంది మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, ఉల్లిపాయ, పసుపు, అల్లం, సోయాబీన్, వేరుశనగ, చెరకు మరియు కూరగాయలు వంటి పంటల సాగులో సల్ఫర్ వాడాలి. • నత్రజని, భాస్వరం,ఫెర్రస్, జింక్ మరియు బోరాన్ వంటి పోషకాల లభ్యతను సల్ఫర్ మెరుగుపరుస్తుంది. • సల్ఫర్ వేడిని ఉత్పత్తి చేస్తుంది కావున వర్షాకాలంలో మట్టిలో అధిక తేమ ఉన్నప్పుడు తేమ శాతాన్ని సాధారణ స్థాయికి తేవడానికి సల్ఫర్ సహాయపడుతుంది మరియు మొక్క బలంగా పెరగడానికి ఇది తోడ్పడుతుంది. తెగుళ్ళు మరియు వ్యాధుల నియంత్రణ: • బూజు తెగులు మరియు ఎర్ర నల్లిని నియంత్రించడానికి సల్ఫర్ ను మొక్కపై పిచికారీ చేయండి. సల్ఫర్ 80% @ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. సల్ఫర్ ధాతు లోపం యొక్క లక్షణాలు: • మొక్కలో సల్ఫర్ ధాతు లోపం ఉంటే, ఆకు యొక్క కొమ్మ దగ్గర లేత పసుపు రంగు ఏర్పడుతుంది. • సేంద్రీయ పదార్థాలు ఇసుక నేలల్లో లేకపోతే, అది సల్ఫర్ ధాతు లోపం వల్ల కావచ్చు. సల్ఫర్ మూలం: • ప్రారంభ దశలో , సల్ఫర్‌ను మొదటి దఫా ఎరువులతో కలిపి ఇవ్వండి మరియు నిలువుగా పండించే పంటలకు డ్రిప్ ద్వారా ఇవ్వండి మరియు బెనెసల్ఫ్ 90%, కొసావెట్ ఎరువులను 90%, సల్ఫామాక్స్ గ్రోమోర్ 90%, జువారి సల్ఫర్ 90% వంటి ఇతర ఎరువులను వాడవచ్చు. • సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,సల్ఫేట్ ఆఫ్ పొటాష్, 20: 20: 00: 13, 00:00:50 (నీటిలో కరిగే ఎరువు) వంటి ఎరువులలో కూడా సల్ఫర్ లభిస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు: సల్ఫర్ నేలలో వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వేసవిలో దీనిని వాడకండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
395
0