AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ప్రత్తి పంటలో పిండినల్లి పురుగు యొక్క సమగ్ర సస్య రక్షణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ప్రత్తి పంటలో పిండినల్లి పురుగు యొక్క సమగ్ర సస్య రక్షణ
పిండినల్లి భారతదేశం యొక్క స్థానిక పురుగు కాదు, ఇది ఇతర దేశాల నుండి సంక్రమించినది. ఈ పురుగు 2006 లో గుజరాత్ లో వ్యాప్తి చెందింది మరియు తరువాత ఇతర రాష్ట్రాలలో కూడా గమనించబడినది . ప్రత్తి పండించిన సంవత్సరం ఈ పురుగు ముట్టడి కనిపిస్తుంది. ప్రత్తితో పాటు, ఈ పురుగు ఇతర పంటలపై కూడా దాడి చేస్తుంది. ఈ రోజుల్లో, భారతదేశంలో ప్రత్తి పండించే అనేక ప్రాంతాలలో పిండినల్లి యొక్క ముట్టడి గమనించవచ్చు. పురుగు ఆశించిన మొక్కలు వంకరగా, గుబురుగా ఉంటాయి మరియు ఆకులు ముడుచుకొని లేదా వంకర తిరిగి, గుత్తులుగా ఉంటాయి మరియు మొక్కలు కుంగినట్లు కనిపిస్తాయి.పురుగు సోకిన మొక్కలు పసుపు రంగులోకి మారి పూర్తిగా ఎండిపోతాయి. ఇది మొక్కల కిరణజన్య సంయోగక్రియకు కూడా ఆటంకం కలిగిస్తుంది. వర్షాకాలంలో పొడి వాతావరణం ఎక్కువ కాలం ఉన్నప్పుడు లేదా వర్షాకాలం ముగిశాక వీటి జనాభా పెరుగుతుంది.
సమగ్ర సస్య రక్షణ:_x000D_ • అన్ని కలుపు మొక్కలను తొలగించి నాశనం చేయండి._x000D_ • నీటి కాలువలలో పిండినల్లి పురుగు సోకిన కలుపు మొక్కలను వేయవద్దు._x000D_ • పొలంలో చీమల కాలనీలను గుర్తించి, క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి @ 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి ఆ రంధ్రాలను తడిపివేయండి. అవసరాన్ని బట్టి ఇలా 2-3 సార్లు చేయండి._x000D_ • తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను తొలగించి పొలానికి దూరంగా తీసుకువెళ్లి, మొక్కలను నాశనం చేయండి. _x000D_ • మరొక ప్రత్తి పొలాలకు వెళ్ళే ముందు నీటితో లేదా రసాయన పురుగుమందులతో పరికరాలను కడగాలి._x000D_ • పిండినల్లి యొక్క పరాన్నజీవి అనాసియస్ బంబవాలీ(40-70% పరాన్నజీవి) . ఈ పరాన్నజీవిని సమృద్ధిగా గమనించినప్పుడు విషపూరిత పురుగుమందులను పంట మీద ఉపయోగించరాదు ._x000D_ • పొలాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు ఈ పురుగు వ్యాప్తిని అరికట్టడానికి సిఫార్సు చేసిన పురుగుమందులను పురుగు కనిపించిన చోట పిచికారీ చేయండి._x000D_ • తెగులు ప్రారంభ దశలో, వేప నూనె @ 40 మి.లీ లేదా వేప ఆధారిత సూత్రీకరణ @ 10 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి)10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ • సాయంత్రం సమయంలో అధిక తేమతో కూడిన రోజులలో వెర్టిసిలియం లెకాని, ఫంగల్ పాథోజెన్ @ 40 గ్రా లేదా మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ • పురుగుల ముట్టడి పెరుగుతున్నట్లయితే ప్రొఫెనోఫోస్ 50 ఇసి @ 10 మి.లీ లేదా థియోడికార్బ్ 50 డబ్ల్యుపి 10 గ్రాములు లేదా బుప్రోఫెజిన్ 25 ఎస్సి @ 20 మి.లీ లేదా క్లోరిపైరిఫోస్ 20 ఇసి @ 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. ఈ ద్రావణంలో 10 లీటర్ల నీటికి ఏదైనా డిటర్జెంట్ పౌడర్ @ 10 గ్రాములు కలపండి._x000D_ • ప్రతి సారి పురుగుమందులను మార్చి వాడండి . పురుగు మందు ద్రావణంతో మొక్కలు బాగా తడిచేలా చూడండి. _x000D_ • గొర్రెలు / మేక / జంతువులను పొలంలో మేయడానికి అనుమతించవద్దు. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
537
3