AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ధాన్యాలకు బయో ఫెర్టిలైజర్‌తో విత్తన శుద్ధి
సేంద్రీయ వ్యవసాయంKVK Mokokchung, Nagaland
ధాన్యాలకు బయో ఫెర్టిలైజర్‌తో విత్తన శుద్ధి
బయో ఫెర్టిలైజర్లు ప్రభావవంతమైన బాక్టీరియా, శిలీంధ్రాలు, ఆల్గే వంటి సూక్ష్మజీవుల జాతులను కలిగి ఉంటాయి లేదా విత్తనాలకు , మొలకలకు మరియు నేలల్లో వీటిని తగినంత సంఖ్యలో కలిపినప్పుడు , అవి సూక్ష్మజీవుల చర్య ద్వారా మొక్కకు పోషకాలను అందిస్తాయి.
బయో ఫెర్టిలైజర్స్ • అజోటోబాక్టర్, అజోస్పిరిల్లమ్, ఫాస్ఫోటికా ధాన్యాలు: ప్రధాన ధాన్యాలు: • వరి • గోధుమ • మొక్కజొన్న చిన్న ధాన్యాలు: • బార్లీ • ఓట్స్ • చిరుధాన్యాలు • జొన్నలు మొదలైనవి. ఉపయోగించు విధానం: విత్తన శుద్ధి : 300-400 మి.లీ నీటిలో 200 గ్రాముల అజోటోబాక్టర్ లేదా 200 గ్రాముల అజోస్పిరిల్లమ్ మరియు 200 గ్రాముల ఫాస్ఫోటికాను వేసి బాగా కలపాలి. అన్ని విత్తనాలకు ఇది బాగా అంటుకోవడానికి గాను దీనిని 10-12 కిలోల విత్తనాలకు కలిపి చేతులతో బాగా కలపండి. ఇలా చేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే పొలంలో విత్తండి. మొక్క యొక్క వేర్లను ద్రావణంలో ముంచే పద్దతి 1 కిలో అజోటోబాక్టర్ మరియు 1 కిలో ఫాస్ఫోటికాను తగినంత నీటి పరిమాణంలో కలపండి మరియు ఈ ద్రావణంలో 1 ఎకరంలో నాటడానికి సరిపడే మొలకల యొక్క వేర్లను 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ముంచి వెంటనే నాటుకోవాలి. వరి విషయంలో, పొలంలో ఒక చిన్న బెడ్‌ను సిద్ధం చేసి 3-4 అంగుళాల నీటితో నింపండి. ఈ నీటిలో 2 కిలోల అజోస్పిరిల్లమ్ 2 కిలోల ఫాస్ఫోటికాను వేసి కలపాలి. 1 ఎకరా పొలంలో నాటుకోవడానికి సరిపడా నారును(నారు యొక్క వేర్లను) ఈ ద్రావణంలో 8-12 గంటలు (రాత్రిపూట) ఉంచి నాటుకోవాలి. ఉపయోగాలు : •పంట దిగుబడి 20-30% పెరుగుతుంది. •రసాయన ఎరువులను 25% భర్తీ చేస్తుంది. •సహజ సారవంతాన్ని పెంచుతుంది . •మొక్కలకు పోషకాలను చాలా తక్కువ ఖర్చుతో అందించండి. •మట్టి సారం మరియు మొక్కల పెరుగుదలపై ఎటువంటి హానికరమైన ప్రభావాలు ఉండవు. •విత్తనాల అంకురోత్పత్తి, పుష్పించే మరియు పంటలో పరిపక్వతను వేగవంతం చేస్తుంది. •సేంద్రీయ వ్యర్థాలను రీసైక్లింగ్ / కుళ్లడానికి సహాయపడుతుంది. •తదుపరి పంటలకు అవశేష ప్రభావాలను అందిస్తుంది. •కాలుష్యం లేని మరియు పర్యావరణానికి అనుకూలమైనది. జాగ్రత్తలు: •బయో ఫెర్టిలైజర్స్ ను చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. •ఉపయోగించడానికి ముందు మాత్రమే ప్యాకెట్లను తెరవండి మరియు పదార్దాన్ని మొత్తం అదే సమయంలో ఉపయోగించండి. •బయో ఫెర్టిలైజర్లతో చికిత్స చేసిన విత్తనాన్ని రసాయన ఎరువులు మరియు పురుగుమందులతో కలపకూడదు. •విత్తనాలను శిలీంద్రనాశకాలతో శుద్ధి చేయాలంటే, మొదట విత్తనాలను శుద్ధి చేయండి, తరువాత రెట్టింపు మోతాదుతో బైయోఫెర్టిలైజర్లతో శుద్ధి చేయండి. •విత్తన శుద్ధి మరియు బైయోఫెర్టిలైజర్లను కంపోస్ట్‌తో కలపడం వంటి పనులు నీడలో చేయాలి. •రసాయన ఎరువులు మరియు సేంద్రియ ఎరువులతో పాటు బయో ఫెర్టిలైజర్ల వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. బైయోఫెర్టిలైజర్ రసాయన ఎరువులను భర్తీ చేయలేవు, కానీ వాటి అవసరాలను తీర్చగలవు. మూలం: కెవికె మోకోక్చుంగ్, నాగాలాండ్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
99
1