AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
చెదపురుగుల నివారణకు గాను గోధుమ విత్తనాలకు విత్తన శుధ్ధి
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
చెదపురుగుల నివారణకు గాను గోధుమ విత్తనాలకు విత్తన శుధ్ధి
చాలా రాష్ట్రాల్లో, గోధుమ పంటను శీతాకాలపు ధాన్యపు పంటగా సాగు చేస్తున్నారు. గోధుమ పంటను సాగునీరు లేదా సాగునీరు లేకుండా కూడా సాగు చేస్తారు. ఈ సంవత్సరం, వర్షాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే కురిసాయి. అందువల్ల, నీటిపారుదల లేని ప్రాంతంలో కూడా రైతులు ఈ పంటను సాగు చేయవచ్చు. పంట మొలకెత్తిన తర్వాత చెదపురుగుల వల్ల దెబ్బతినవచ్చు. చెదపురుగుల ముట్టడి సాధారణంగా భారీ మరియు నల్ల మట్టిలో తక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఇసుక నేలలో ఎక్కువగా ఉండడం వల్ల పంటకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. తల్లి పురుగు సంవత్సరాల తరబడి గుడ్లు పెడుతుంది మరియు ఇది మట్టిలో 7-8 అడుగుల దిగువన నివసిస్తున్నందున దీని నియంత్రణ అసాధ్యం. ఒకసారి, చెదపురుగులు క్షేత్రంలో స్థిరపడితే, ప్రతి సంవత్సరం వీటి ముట్టడి గమనించవచ్చు.
చెదపురుగులు మొక్కలను మొదళ్ళ దగ్గర కత్తిరించి వేర్ల వ్యవస్థను తిని వేస్తాయి. తత్ఫలితంగా, మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ పురుగు సోకిన మొక్కలను నేల నుండి తేలికగా బయటకు తీయవచ్చు. పాచె లాగా ముట్టడి గమనించవచ్చు . పొలానికి నీరు అధికంగా పెట్టినట్లయితే ముట్టడి పెరుగుతుంది. చెదపురుగులు పంట ప్రారంభ దశలో మరియు కంకి ఏర్పడుతున్న దశలో పంటను దెబ్బతీస్తాయి. గోధుమ విత్తనాల విత్తే సమయంలో చెదులు నియంత్రణ చర్యలు చేపట్టండి: • గోధుమ విత్తనాలు పొలంలో విత్తడానికి ముందు మునుపటి పంట అవశేషాలను పొలం నుండి తొలగించి నాశనం చేయండి. • పొలానికి బాగా కుళ్ళిన పశువుల ఎరువును మాత్రమే ఇవ్వాలి. • పశువుల ఎరువుకు బదులుగా, రైతు ఆముదం, వేప లేదా కానుగ చెక్కను హెక్టారుకు 1 టన్ను చొప్పున ఇవ్వచ్చు. • విత్తనాన్ని విత్తడానికి ముందు విత్తన శుధ్ధి చేయడం వల్ల తక్కువ ఖర్చుతో చెదపురుగులను నిర్వహించవచ్చు. విత్తన శుధ్ధి కోసం, బైఫెన్‌త్రిన్ 10 ఇసి 200 మి.లీ లేదా ఫిప్రోనిల్ 5 ఎస్సీ 500 మి.లీ లేదా క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి 400 మి.లీ 5 లీటర్ల నీటిలో కలిపి దీనికి 100 కిలోల విత్తనాలను కలపడం ద్వారా విత్తన శుధ్ధి చేయవచ్చు. విత్తనాన్ని నేల మీద లేదా ప్లాస్టిక్ షీట్ మీద విస్తరించి, ఈ ద్రావణాన్ని గోధుమలపై పిచికారీ చేయాలి. చేతికి రబ్బరు తొడుగులు ధరించి విత్తనాలు బాగా కలపాలి. శుధ్ధి చేసిన విత్తనాన్ని రాత్రి మొత్తం ఆరబెట్టాలి మరియు మరుసటి రోజు ఉదయం విత్తనాలు విత్తుకోవాలి. • విత్తన శుధ్ధి చేయకుంటే మొక్కలు చెదపురుగుల బారిన పడినట్లయితే, ఫిప్రోనిల్ 5 ఎస్సీ 1.5 లీటర్లు లేదా క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి 1.5 లీటర్లు 100 కిలోల ఇసుకతో కలిపి పొలానికి ఇవ్వండి. పంట ఉన్న పొలానికి దీనిని ఇచ్చిన తర్వాత నీరును పెట్టండి. • క్రమం తప్పకుండా పొలానికి నీరు పెట్టి పొలంలో తేమ ఉండేలా చేయండి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
631
3