AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఎగుమతి నాణ్యత గల జెర్బెరా పూల సాగు విధానం
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఎగుమతి నాణ్యత గల జెర్బెరా పూల సాగు విధానం
గ్రీన్ హౌస్ నందు జెర్బెరా సాగు చేయడానికి, బాగా నీరు ఆవిరి అయ్యే ప్రాంతాన్ని ఎంచుకోండి. నాణ్యమైన పువ్వులు ఉత్పత్తి చేయడం కోసం, టిష్యూ కల్చర్ మొక్కలను ఉపయోగించండి. మెరుగైన సాంకేతికతను ఈ పంట సాగుకు జోడించినప్పుడు గరిష్ట దిగుబడిని పొందవచ్చు. వెరైటీ ఎంపిక: మార్కెట్ లేదా కస్టమర్ డిమాండ్‌ను బట్టి రకాలను ఎంచుకోవాలి. భూమి ఎంపిక: జెర్బెరా సాగు కోసం బాగా నీటి పారుదల ఉన్న భూమిని ఎంచుకోండి. (మట్టిలో pH 5.5 నుండి 6 ఉండాలి) నాటడం: నేలలోని క్రిములను సంహరించిన తరువాత, నిపుణుల సలహా మేరకు మొక్కలను 30 సెం.మీ x 30 సెం.మీ (మీటరుకు 7 నుండి 9) దూరంలో నాటాలి. టిష్యూ కల్చర్ పద్దతిని ఉపయోగించి తయారు చేసిన మొలకలను ఎంచుకోండి. మొలకలని ఎక్కువ లోతులో నాటవద్దు మరియు గ్రీన్ హౌస్ లో సరిపడా మొక్కలను నాటండి. నీటి నిర్వహణ: పంట పరిస్థితి లేదా అవసరానికి అనుగుణంగా మొక్క యొక్క అన్ని దశలో నీటిని అందించండి. ఎరువుల నిర్వహణ: పశువుల ఎరువును చదరపు మీటరుకు 10 కిలోలు చొప్పున, ట్రైకోడెర్మా వైరైడ్, బాసిలోమైసెస్ మరియు నీమ్ కేక్ తో కలిపి పొలానికి ఇవ్వండి. మట్టి పరీక్ష రిపోర్ట్ ఆధారంగా, ఎరువులను ఇవ్వాలి. మొక్క ప్రారంభ దశలో, 19:19:19 @ 2 కిలోలు 4 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. పూత వచ్చిన తరువాత, 12:61:00 ఎరువును ఎకరాకు 3 కిలోలు 5 నుండి 6 రోజుల వ్యవధిలో పూత ఎక్కువగా రావడానికి ఇవ్వండి. ఎరువులతో పాటు, పూత రాక ముందు లేదా పూత వచ్చిన తర్వాత సూక్ష్మ పోషకాలను కూడా అందించాలి, అనగా బోరాన్, కాల్షియం, మెగ్నీషియం మొదలైనవి. బోరాన్, కాల్షియం మరియు మెగ్నీషియం 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి నెలకు ఒకసారి పిచికారీ చేయాలి. అదనంగా, పూత రావడం కోసం, ఎకరానికి 13:00:45 @ 3 కిలోలు 5 నుండి 6 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. అధిక నాణ్యత గల పువ్వుల కోసం బిందు సేద్యం ద్వారా సూక్ష్మపోషకాలను అందించాలి. ఇది పువ్వుల నాణ్యతను మాత్రమే కాకుండా పువ్వుల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. పంట కోత: • జెర్బెరా పువ్వులు సాధారణంగా మొక్క నాటిన 8 నుండి 10 వారాలకు కోతకు వస్తాయి. • పూల రేకుల రెండు వరుసలలో పుష్పించిన తరువాత మాత్రమే పువ్వులను కోయాలి. • పువ్వులు కోసిన తరువాత క్రింద నుండి 3 లేదా 4 సెం.మీ వరకు కత్తిరించాలి. • సాధారణంగా, పువ్వులను ఉదయం కోయాలి. • పువ్వులను కోసిన తర్వాత వాటి కాడలను బకెట్ నీటిలో ఉంచండి. • పువ్వులు తాజాగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి, 7 నుండి 10 మి.లీ సోడియం హైపోక్లోరైట్ ను లీటరు నీటికి కలిపి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని తయారు చేయాలి తర్వాత పూలను ఈ ద్రావణంలో ముంచండి. • ప్రతి పూల కోతకు ఈ ద్రావణాన్ని మార్చి వాడండి. మూలం: ఆగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
133
0