AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
స్మార్ట్ ఫార్మింగ్నోల్ ఫార్మ్
ఎండుద్రాక్ష తయారీ విధానం:
ద్రాక్ష పూర్తి పరిమాణంలో పెరిగినప్పుడు, ఎమల్షన్ ద్రావణాన్ని యంత్రం సహాయంతో ద్రాక్ష గుత్తుల మీద పిచికారీ చేయండి. ద్రాక్ష యొక్క తీపిని పరిశీలించి, ద్రాక్ష గుత్తులను చెట్లకే ఉంచి ఎండబెట్టండి. ఎండిన ద్రాక్షను యంత్రం సహాయంతో కోసి వాటిని ప్రాసెసింగ్ యూనిట్కు రవాణా చేస్తారు. డిహైడ్రేషన్ ప్రక్రియ కోసం ఈ ద్రాక్ష గుత్తులను ట్రేలలో నింపాలి. తర్వాత ఈ ద్రాక్షను ఒక యంత్రంలో వేస్తారు, ఇది ద్రాక్ష నుండి పుల్లలను వేరు చేస్తుంది. తర్వాత ఎండుద్రాక్షను కడిగి, ఎండబెట్టి, నాణ్యతను తనిఖీ చేయడం కోసం పంపుతారు మరియు చివరకు వీటిని మార్కెట్‌కి పంపించడానికి పెట్టెల్లో ప్యాక్ చేస్తారు.
మూలం: నోల్ ఫామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
128
3