AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
స్పైడర్ జీవిత చక్రం
ఆర్థిక నష్టం: స్పైడర్ వివిధ కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాలతో పాటు నూనెగింజల పంటలకు నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని జాతుల స్పైడర్లు కూడా వ్యాధికారకంగా పని చేస్తాయి మరియు వైరల్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి._x000D_ _x000D_ జీవిత చక్రం :_x000D_ గుడ్డు: తల్లి పురుగు ఆకుల ఉపరితలంపై 35-70 గుడ్లను గూడు క్రింద ఉంచుతాయి. గుడ్డు యొక్క కాల వ్యవధి సుమారు 3-4 రోజుల పాటు ఉంటుంది._x000D_ పిల్ల పురుగు: దీనిని రెండు దశలుగా విభజించారు. మొదటిది "ప్రోటోనింఫ్" రూపంలో మరియు రెండవది "డ్యూట్మానిఫ్" గా ఉంటుంది. పిల్ల పురుగులు మురికి తెలుపు రంగులో లేదా ఎరుపు-పసుపు రంగులో ఉంటాయి. పిల్ల పురుగుల దశ 3 వారాల పాటు ఉంటుంది._x000D_ తల్లి పురుగులు: తల్లి పురుగులు ఎరుపు రంగులో ఉంటాయి. వీటి వ్యవధి 12–33 రోజుల పాటు ఉంటుంది మరియు ఇవి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. గుడ్ల నుండి వయోజన జీవిత చక్రం సుమారు 3 నుండి 6 వారాలు పాటు ఉంటుంది మరియు సంవత్సరంలో అనేక తరాలు సంభవిస్తాయి. _x000D_ నియంత్రణ: _x000D_ • ఫెనోప్రాక్సిమేట్ 5 ఎస్పీ @ 10 మి.లీ లేదా ఫెనాజోక్విన్ 10 ఇసి @ 10 మి.లీ లేదా సల్ఫర్ 80 డబ్ల్యూ పి @ 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_
90
0