గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
దాసరి పురుగు మరియు ఆకు తినే గొంగళి పురుగు నుండి మీ ఆముదం పంటను కాపాడండి
ఆముదం పంటను దేశంలోని చాలా ప్రాంతాల్లో పండిస్తారు. ఈ పంటను కొన్ని రాష్ట్రాల్లో వేరుశనగ మరియు ప్రత్తిలో అంతర పంటగా సాగు చేస్తారు. రసం పీల్చే పురుగులతో పాటు, దాసరి పురుగు మరియు ఆకు తినే గొంగళి పురుగు సాధారణంగా వృక్ష దశలో కాస్టర్ పంటకు నష్టం కలిగిస్తాయి.
దాసరి పురుగు మొక్కపై కదులుతున్నప్పుడు సెమీ లూప్ ఆకారంలో ఉంటుంది కావున దీనిని "సెమిలూపర్" అని పిలుస్తారు. ఇది శరీరం మీద బహుళ రంగు చారలు / మచ్చలను కలిగి ఉంటుంది. చిన్న పురుగు ఎపిడెర్మల్ పొరను గీరితే, పెద్ద గొంగళి పురుగులు ఆకును తిని, ఈనె మరియు కాండం మాత్రమే మిగిలిస్తుంది. దీనిని విపరీతంగా తినే గొంగళి పురుగు అని కూడా అంటారు. అధిక ముట్టడి ఉన్నట్లయితే, ఇవి కాస్టర్ క్యాప్సూల్స్‌లోని విత్తనాలను మరియు స్పైక్ ని కూడా తినవచ్చు. పెద్ద గొంగళి పురుగులు నిమ్మ పండ్ల నుండి రసాన్ని పీలుస్తాయి. వేసవిలో ఇవి బెర్ చెట్లపై జీవిస్తాయి._x000D_ _x000D_ చిన్న ఆకు తినే గొంగళి పురుగులు ఆకు యొక్క దిగువ ఉపరితలంపై ఉండి ఎపిడెర్మల్ పొరను గీకి ఆకును తింటాయి, ఉపరితలంపైన పారదర్శక మచ్చలు కనిపిస్తాయి. అధునాతన దశలలో, పురుగు వ్యాప్తి చెంది ఆకులను, పైన ఉన్న కొమ్మలను మరియు క్యాప్సూల్స్ లను తింటాయి._x000D_ _x000D_ సమగ్ర సస్య రక్షణ:_x000D_ _x000D_ • సాధారణంగా, ఆగస్టు రెండవ పక్షంలో నాటిన పంటలో దాసరి పురుగు యొక్క ముట్టడి తక్కువగా ఉంటుంది._x000D_ • దాసరి పురుగు మరియు ఆకు తినే గొంగళి పురుగుల చిమ్మటలను ఆకర్షించడానికి మరియు చంపడానికి ఒక దీపపు ఎరను ఏర్పాటు చేయాలి._x000D_ • ఆకు తినే గొంగళి పురుగును నియంత్రించడానికి, ఎకరానికి 5-6 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి ._x000D_ • ఆకు తినే గొంగళి పురుగు యొక్క గుడ్ల ద్రవ్యరాశిని మరియు పిల్ల పురుగులను సేకరించి నాశనం చేయాలి. _x000D_ • ఏదైనా పురుగుమందులను పిచికారీ చేయడానికి ముందు, దాసరి పురుగు మరియు ఆకు తినే గొంగళి పురుగుల పెద్ద పురుగులను సేకరించి (హ్యాండ్ పికింగ్) నాశనం చేయండి._x000D_ • బాసిల్లస్ తురింజెన్సిస్ (బ్యాక్టీరియా ఆధారిత పొడి) హెక్టారుకు 1-1.5 కిలోలు చొప్పున పిచికారీ చేయండి. _x000D_ • ఆకు తినే గొంగళి పురుగు యొక్క న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ (SNPV) ను హెక్టారుకు 250 LU చొప్పున పిచికారీ చేయండి. _x000D_ • సాధారణంగా, పక్షులు దాసరి పురుగులను తింటాయి. పొలంలో పక్షులను ఆకర్షించడానికి అవసరమైన చర్య చేపట్టండి._x000D_ • వేప విత్తన ఆధారిత నూనె @ 5% లేదా వేప ఆకు సారం @ 10% లేదా వేప ఆధారిత సూత్రీకరణ @ 10 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. _x000D_ • ఒక మొక్కకు దాసరి పురుగు యొక్క జనాభా 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పురుగుమందులను పిచికారీ చేయండి._x000D_ డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
182
0
సంబంధిత వ్యాసాలు