AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఫ్రూట్ ప్రాసెసింగ్మీడియా స్పేస్
ఎండుద్రాక్ష తయారీ
మీరు మంచి నాణ్యమైన ఎండుద్రాక్షను తయారు చేయాలనుకుంటే, ఎండుద్రాక్షను తయారుచేసేటప్పుడు, ఏకరీతిగా ఉన్న, మంచి రంగు కలిగి ఉన్న ద్రాక్ష గుత్తులను తోట నుండి సేకరించాలి. మంచి నాణ్యమైన ఎండుద్రాక్షను పొందడం కోసం గుత్తి కోసే ముందు, ద్రాక్ష తియ్యగా ఉందో లేదో చూడండి. ద్రాక్షను శుభ్రమైన నీటితో కడగండి. తర్వాత ద్రాక్షను పొటాషియం కార్బోనేట్ @ 25 గ్రాములు + ఇథైల్ ఒలీట్ @ 15 మి.లీ (ముంచే నూనె) కలిపిన ద్రావణంలో రెండు నుండి నాలుగు నిమిషాల పాటు ముంచండి. ఈ ద్రావణం యొక్క ఉదజని శాతం 11 వరకు ఉండాలి. తర్వాత ద్రావణం నుండి తీసివేసిన ద్రాక్షను నీడలో మెష్ మీద ఎండబెట్టాలి. పరిసర ఉష్ణోగ్రతను బట్టి, 3 నుండి 7 రోజులలో మంచి నాణ్యమైన ఎండుద్రాక్ష తయారవుతుంది. మూలం: - మీడియా స్పేస్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
138
1