AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మదర్ డెయిరీ స్టోర్ నుండి టమోటాలు ఈ ధరలకు లభిస్తాయి
కృషి వార్తAgrostar
మదర్ డెయిరీ స్టోర్ నుండి టమోటాలు ఈ ధరలకు లభిస్తాయి
ఆకాశాన్ని తాకిన టమోటా ధరలు వచ్చే వారం నాటికి అదుపులోకి వస్తాయి. వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార పంపిణీ శాఖలో జరిగిన అంతర్-మంత్రివర్గ సమావేశంలో, కర్ణాటక మరియు మధ్య ప్రదేశ్ లో కొత్త టమోటా పంట రాక ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పుడు ఈ టమోటా మదర్ డెయిరీ తన అవుట్‌సెట్లలో కిలోకు 55 రూపాయల చొప్పున విక్రయిస్తుంది. వరదలు మరియు వర్షాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో పంటలను దెబ్బతీశాయి, కాని ఆంధ్రప్రదేశ్‌లో వర్షం వల్ల టమోటా పంట దెబ్బతినలేదు. అందుకే ఢిల్లీలో-ఎన్‌సీఆర్‌లో టమోటాల సరఫరాను పెంచాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం, టొమాటోలను ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కిలోకు 60 నుంచి 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి టమోటాలు ఢిల్లీకి రావడం ప్రారంభించిన వెంటనే సరఫరా సాధారణ స్థాయికి వస్తుంది. దీని తరువాత, ధరలు సాధారణం స్థాయికి వస్తాయి. మూలం: కృషి జాగ్రాన్ 19 అక్టోబర్ 2019
99
0