AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఎమ్‌ఎమ్‌టిసి ఈజిప్ట్ నుండి 6,090 టన్నుల ఉల్లిపాయను ఆర్డర్ చేసింది
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
ఎమ్‌ఎమ్‌టిసి ఈజిప్ట్ నుండి 6,090 టన్నుల ఉల్లిపాయను ఆర్డర్ చేసింది
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎమ్‌ఎమ్‌టిసి ఈజిప్ట్ నుండి 6,090 టన్నుల ఉల్లిపాయను దిగుమతి చేసుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది మరియు వచ్చే నెల ప్రారంభం నుండి ఈ సరుకు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఇటీవల, 1.2 లక్షల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి కేబినెట్ అనుమతించింది. 6,090 టన్నుల ఉల్లిపాయను మిశ్రా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎమ్‌ఎమ్‌టిసి ఒప్పందాలు కుదుర్చుకుంది, త్వరలో ముంబై నౌకాశ్రయానికి ఇవి చేరుకుంటాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో అకాల వర్షాలు మరియు వరదలు కారణంగా ఉల్లి పంటలు భారీగా నష్టపోయాయి. ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్రం సెప్టెంబర్ 29 న స్టాక్ పరిమితిని నిర్ణయించింది. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిన్న కారణంగా ఉల్లి కొరత ఏర్పడింది దీని కోసం ఉల్లిపాయలు ముంబైలోని న్వా షెవా (జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్) వద్దకు వస్తాయని భావిస్తున్నారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు ముంబైలో కిలోకు 52-55 రూపాయులుగా మరియు ఢిల్లీలో కిలో 60 రుప్పయులకి లభిస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎకె శ్రీవాస్తవ తెలిపారు. మూలం: ఔట్లుక్ అగ్రికల్చర్, 25 నవంబర్ 2019 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి
157
0