క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
బోర్డియక్స్ మిశ్రమం తయారీ విధానం
అవసరమైన పదార్ధాలు - కాపర్ సల్ఫేట్, సున్నం మరియు నీరు బోర్డియక్స్ మిశ్రమం తయారీ విధానం - • 1% బోర్డియాక్స్ కోసం ఒకకేజీ కాపర్ సల్ఫేట్, ఒక కేజీ సున్నం మరియు 100 లీటర్ల నీటిని తీసుకోవాలి • ముందురోజు రాత్రిపూట 50 లీటర్ల నీటిలో కేజీ కాపర్ సల్ఫేట్ వేయాలి. మరో పాత్రలో 50 లీటర్ల నీటిలో కేజీ సున్నం వేసి కరిగించాలి. • ఒకేసమయంలో రెండింటిని పూర్తిగా కరిగించాలి. తర్వాత మూడోపాత్ర తీసుకుని అందులో రెండు మిశ్రమాలను ఒకసారి పోయాలి. అలా మరోగిన్నెలో పోసేటప్పుడు మిశ్రమాన్ని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. • రెండింటిని మూడోపాత్రలో పోసి పూర్తిగా కలిపిన తర్వాత నీలరంగులోకి మిశ్రమం మారుతుంది. అదే బోర్డియక్స్ మిశ్రమం
మిశ్రమం ఉపయోగించే ముందు పరీక్షించాలి- • ముందుగా మిశ్రమాన్ని పరీక్షించడం కోసం ఓ ఇనపమేకును తీసుకుని అందులో 0.5 నుండి 1 నిమిషం వరకూ ముంచాలి. ఆ తరువాత మేకు ముంచినభాగంలో ఎర్రని పొర కనిపించకపోతే మిశ్రమం వినియోగించేందుకు సిద్దమని అర్ధం. తీసుకోవలసిన జాగ్రత్తలు - • మిశ్రమాన్ని తయారుచేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ పాత్రను ఉపయోగించండి. • తయారుచేసిన మిశ్రమాన్ని 24 గంటల్లోనే ఉపయోగించాలి. • మిశ్రమాన్ని సిద్ధం చేసేటప్పుడు రెండు పదార్ధాలు పూర్తిగా కరిగిపోయాయా లేదా నిర్ధారించుకోవాలి. మిశ్రమాన్ని కలిపేటప్పుడు ఖచ్చితంగా ఇది చల్లబడి ఉండాలి. • బోర్డియక్స్ మిశ్రమాన్ని ఫంగస్ తెగులు నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.
6
0
సంబంధిత వ్యాసాలు