AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
చెరకు పంటలో తెల్ల పేను (వూలీ అఫిడ్స్) నిర్వహణ
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
చెరకు పంటలో తెల్ల పేను (వూలీ అఫిడ్స్) నిర్వహణ
చెరకు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండించే ముఖ్యమైన వాణిజ్య పంట. ప్రధానంగా మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాలలో తెల్ల పేను అను పురుగు పంట ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుంది . ఇది ఆకులపై గుంపులుగా అభివృద్ధి చెందుతుంది మరియు కొన్నిసార్లు చెరకు గడల మీద కనిపిస్తుంది. ఈ గుంపులు తెల్లటి బూడిద ద్రవ్యరాశిలా కనిపిస్తాయి కావున వాటికి తెల్ల పేను (వూలీ అఫిడ్స్) అనే పేరు వచ్చింది. మగ పిల్ల పురుగులు లేత-ఆకుపచ్చ రంగులో మరియు ఆడ పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగుకు రెక్కలు ఉండవు. ఇది పార్శ్వ మాంద్యంతో మృదువైన మరియు విశాలమైన శరీరాన్ని కలిగి ఉంటుంది. శరీరం మీద పత్తి లాగా మరియు తెలుపు సారంతో కప్పబడి ఉంటుంది. మగ పురుగు రెక్కలు కలిగి ఉంటుంది. తెల్ల పేను యొక్క దశలు మరియు ముట్టడి లక్షణాలు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి రసాన్ని పీలుస్తాయి.ఈ పురుగులు తియ్యని జిగట పదార్ధాన్ని విసర్జిస్తాయి, ఇది ఆకుల ఉపరితలంపై పడి దాని మీద నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారుతుంది. మసి యొక్క పొర మందంగా ఉండి, కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది, దీని ఫలితంగా చెరకు దిగుబడి (25%) మరియు సుక్రోజ్ శాతం (26.71%) తగ్గుతుంది. మొక్కలు వృద్ధి చెందే దశలో చనిపోవచ్చు. ఈ తెగులు గాలి, చీమలు మరియు పురుగు సోకిన ఆకుల ద్వారా వ్యాపిస్తుంది. అనుకూలమైన వాతావరణం 70% నుండి 95% తేమతో కూడిన, మేఘావృతమైన వాతావరణం తెల్ల పేను పురుగు పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. జూన్ నెలలో, తీవ్రమైన ముట్టడిని గమనించే అవకాశం ఉంది మరియు సెప్టెంబరు వరకు తెగులు అత్యధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. తెల్ల పేను (వూలీ అఫిడ్స్) నివారణ పద్ధతులు: • ప్రభావిత ప్రాంతాలలోని చెరకును విత్తనంగా, చెరకు సాగుకు ఉపయోగించకూడదు. • తెల్ల పేను నివారించడానికి, సాళ్ల పద్ధతి, కందకం పద్ధతి మరియు ఒక పిలక ఉన్న విత్తనాలను ఉపయోగించి చెరకును నాటవచ్చు. • ముట్టడి ఎక్కువగా ఉంటే పురుగు ఆశించిన చెరకు భాగాలను సేకరించి కాల్చాలి. • చెరకు పంటకు అధికంగా నీరు ఇవ్వకండి. అవసరాన్ని బట్టి మొక్కకు నీరు ఇవ్వండి. • సమతుల్య రసాయన ఎరువులను సిఫారస్సు చేసిన ప్రకారం వాడాలి. పొలంలో అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా నత్రజని ఎరువులను ఇవ్వకండి. పశువుల ఎరువు మరియు వర్మి కంపోస్ట్ హెక్టారుకు 20 టన్నుల చొప్పున ఇవ్వండి. • చెరకులో తెల్ల పేను వృద్ధిని సమర్థవంతంగా నివారించడానికి, లేడీబర్డ్ బీటిల్, గ్రీన్ లేస్వింగ్ వంటి పురుగులను సంరక్షించండి మరియు బయో కంట్రోల్ ఏజెంట్లు అయిన డయాఫా అఫిడోవోరా @ 50000 / ఎకరాకి చొప్పున విడుదల చేయండి. • మిత్ర పురుగులు ఉన్న ప్రాంతంలో రసాయన పురుగుమందులను వాడకండి. • పంట ప్రారంభ దశలో, క్లోరోపైరిఫోస్ను 50% + సైపర్మెత్రిన్ 5% EC @ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి. పొలంలో బిందు సేద్య వ్యవస్థ అందుబాటులో ఉంటే, ఎకరాకు క్లోర్పైరిఫోస్ 50% + సైపర్మెత్రిన్ 5% ఇసి @ 500 గ్రాములు ఎకరానికి చొప్పున పిచికారీ చేయండి. (పురుగు ముట్టడి అధికంగా ఉన్నట్లయితే). • ఆరు నెలల వయస్సు గల చెరకు పంటకు, మట్టి ద్వారా తిమెట్ 10% @ 3-5 కిలోలు / ఎకరానికి చొప్పున ఇవ్వండి. • చెరకు రటూన్ పంటగా వేయకండి మరియు పురుగు సోకిన పంట యొక్క చెత్తను కాల్చకండి. పంటను కోసిన తరువాత, కాండం మరల పెరగకుండా చూడండి. రెఫరెన్స్ - అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
235
2