క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
భూసార పరీక్ష కోసం మట్టి నమూనా ఎలా సేకరించాలి
ఇటీవలి కాలంలో, రైతులు భూసారం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నట్టు నిపుణులు కనుగొన్నారు. సేంద్రీయ ఎరువుల పట్ల అవగాహన లేకపోవడం, రసాయన ఎరువుల వినియోగంలో సమతుల్యత లోపించడం వల్ల భూసారం దెబ్బతింటోంది. దీంతో సహజంగానే ఉత్పాదకతపై ప్రభావం ఉంటోంది. రైతులు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించాలి. వ్యవసాయభూమి నుంచి మట్టి నమూనా తీసుకోవడం ఎలా? • భూసారం పరీక్షల కోసం పంట విత్తనాలు వేయడానికి మూడు నెలలు ముందు, లేదా పంట తీసేసిన మూడు నెలల తర్వాత మట్టిని సేకరించాలి. సేంద్రీయ, రసాయన ఎరువులు వేయడానికి ముందు లేదా తర్వాత కూడా మూడునెలల గ్యాప్ ఉండాలి. పరీక్షల కోసం అరకేజీ మట్టిని శాంపిల్ గా తీసుకోవాలి. • భూసార పరీక్షల కోసం పొలంలో 8 నుంచి 10 చోట్ల నుండి మట్టిని సేకరించాలి
• నేల నుంచి మట్టి నమూనాల తీసుకునేటప్పుడు ముందుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవుతో వీ(V) ఆకారంలో గుంట తవ్వాలి. గోతిలోని ఓ వైపు నుంచి, 2 నుండి 3 సెంటీమీటర్ల మందపాటి పొరను నమూనాగా తీసుకోవాలి. • వ్యవసాయ క్షేత్రంలో 8 నుంచి 10 చోట్ల నుంచి తీసుకున్న మట్టి నమూనాలను ముందుగా శుభ్రం చేయాలి. గట్టిదనం లేకుండా చూడాలి. రాళ్లు, చెత్త, కర్రలు ఇతర వ్యర్థాలు ఉండకూడదు. • ఒక స్టీలు గిన్నెలోకి శాంపిల్ మట్టిని వేసి మొత్తం కలపాలి. జల్లెడ ద్వారా వడగట్టి సరిగ్గా అరకేజీ ఉండేలా చూసుకుని బ్యాగులోకి తీసుకోవాలి. రైతు పేరు, గ్రామం, పొలం నెంబర్ ఓ పేపర్ మీద రాసి మట్టి శాంపిల్ ఉన్న బ్యాగుపై అతికించాలి. ఆపై భూసార పరీక్ష కోసం పంపించాలి. భూసార పరీక్ష ద్వారా నెలలో పోషకాలు ఎలా ఉన్నాయి తెలుస్తుంది. పంట వేయడానికి అనుగుణంగా భూమి ఉందా లేదా తెలుసుకోవచ్చు. లోపాలుంటే సారం పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
2
0
సంబంధిత వ్యాసాలు