క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సేంద్రీయ వ్యవసాయంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
జీవ నియంత్రణ పద్దతుల ద్వారా దానిమ్మ పంటలలో నెమటోడ్ల నియంత్రణ
ప్రస్తుత పరిస్థులలో, అన్ని పంటలలో నెమటోడ్లు ప్రధాన సమస్య. అధిక తేమ మరియు తడిగా ఉన్న నేల కారణంగా, మొక్క యొక్క వేర్లపై నెమటోడ్ ముట్టడి లేదా చెట్ల వేర్లపై బుడిపెలు కనిపిస్తాయి. నెమటోడ్స్ చిన్న పరిమాణంలో ఉంటాయి మరియు పంట యొక్క చిన్న వేర్ల యొక్క అంతర్గత భాగాలలో నివసించడం ద్వారా పంటను దెబ్బతీస్తాయి. ఇది వేర్ల మీద ప్రభావం చూపుతాయి మరియు బుడిపెలు ఏర్పడటంతో మొక్కల పోషణకు నష్టం కలుగ చేస్తుంది. నష్టం వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అదనంగా, నెమటోడ్ల వల్ల కలిగే గాయం వల్ల ఇతర శిలీంధ్ర జీవులు మొక్కను ఆశించే అవకాశం ఉంది. దానిమ్మ మొక్క వాడిపోవడానికి మరియు ఎండిపోవడానికి నెమటోడ్లు ప్రధాన కారకాలు. దానిమ్మ పండ్ల తోటలో నెమటోడ్లను నియంత్రించడానికి ఈ జీవ నియంత్రణ పద్ధతులను అనుసరించండి: • దానిమ్మ మొక్కలను తోటలో నాటడానికి ముందు, పొలంలోని మట్టి మీద ప్లాస్టిక్ కవర్ ను కప్పండి ఇలా చేయడం వల్ల మట్టి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇది నేలలో ఉన్న నెమటోడ్లను నియంత్రణకు సహాయపడుతుంది. • దానిమ్మ తోటలలో టొమాటో, వంకాయ , మిరపకాయలు మరియు బెండకాయ మొదలైన పంటలను పెంచవద్దు. • బహర్ లేదా చెట్ల కత్తిరింపులు చేసిన తరువాత, ఆఫ్రికన్ బంతి పువ్వు మొక్కలు దానిమ్మ మొక్కల చుట్టూ నాటాలి. • చెట్ల చుట్టూ పాది తయారు చేయండి మరియు వేప చెక్కను చెట్టు చుట్టూ ఒక మొక్కకు 2-3 కిలోలు చొప్పున ఇవ్వాలి. • ట్రైకోడెర్మాప్లస్ @ 500 గ్రాములు మరియు పెసిలోమైసెస్ లిలాసినస్ ను ఎకరానికి 1-3 కిలోల పశువుల ఎరువుతో కలిపి మట్టికి ఇవ్వాలి మరియు దీనిని 30 రోజుల వ్యవధిలో మరల ఇవ్వాలి. రెఫరెన్స్: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
348
3
సంబంధిత వ్యాసాలు