AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బాస్మతి బియ్యం యొక్క ఎగుమతులు 15% తగ్గుతాయని అంచనా
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
బాస్మతి బియ్యం యొక్క ఎగుమతులు 15% తగ్గుతాయని అంచనా
ఇరాన్ నుంచి దిగుమతి డిమాండ్ లేకపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 12 నుంచి 15% తగ్గుతాయని అంచనా. ఇది బాస్మతి వరి రైతులపై ప్రభావం చూపుతుంది. పూసా బాస్మతి వరి 1,121 ధర మండిస్‌లో క్వింటాల్‌కు రూ. 2,750 నుండి రూ. 2,800 గా ఉంది, గతేడాది ఇది క్వింటాల్‌కు రూ. 3,150 నుండి రూ. 3,200 రూపాయలుగా ఉంది.
భారతీయ బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునేది ఇరాన్ , ఇరాన్‌ నుండి భారతీయ ఎగుమతిదారులకు ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు రావలసి ఉందని, అందువల్ల ఎగుమతిదారులు కొత్త ఎగుమతి ఒప్పందాలు చేయడం లేదని ఎపిఎడిఎ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మొదటి భాగంలో, బాస్మతి బియ్యం ఎగుమతి 11.33% తగ్గి 18.70 లక్షల టన్నుల ఎగుమతులకు చేరింది గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఎగుమతులు 20.82 లక్షల టన్నులుగా ఉంది. _x000D_ మూలం - ఔట్లుక్ అగ్రికల్చర్,2 నవంబర్ 2019 _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి._x000D_
139
0