క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అప్ని ఖేతి
ఉసిరి : దీని ఉపయోగాలు మరియు ఎరువుల నిర్వహణ
గూస్బెర్రీ లేదా నెల్లీ అని విస్తృతంగా పిలువబడుతున్న ఉసిరి, పలు ఔషధ లక్షణాలను కలిగి ఉంది. రక్తహీనత, పుండ్లు, విరోచనాలు, పంటి నొప్పి మరియు జ్వరాల చికిత్సకు ఉపయోగించే వివిధ ఔషదాల తయారీలో ఈ పండ్లను ఉపయోగిస్తారు. ఈ పండ్లు విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఉసిరి పండ్లను పచ్చడితో పాటు షాంపూ, హెయిర్ ఆయిల్, డై, టూత్ పౌడర్ మరియు ఫేస్ క్రీమ్స్ వంటి పదార్దాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది సగటున 8-18 మీటర్ల ఎత్తు మరియు ఆకర్షణీయమైన కొమ్మలతో కూడిన చెట్టు. దీని పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి మరియు వీటి పువ్వులు రొండు రకాలు, మగ మరియు ఆడ పువ్వులు. దీని పండ్లు లేత-పసుపు రంగులో ఉంటాయి మరియు 1.3-1.6 సెం.మీ వెడల్పు ఉంటాయి. భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఉసిరి పంటను ప్రధానంగా సాగు చేస్తున్న రాష్ట్రాలు. ఎరువుల నిర్వహణ: • భూమిని తయారుచేసే సమయంలో 10 కిలోల పశువుల ఎరువును వేసి మట్టిలో కలపాలి. నత్రజని @ 100 గ్రా / మొక్క, భాస్వరం @ 50 గ్రా / మొక్క, మరియు పొటాషియం @ 100 గ్రా / మొక్క చొప్పున N: P: K ఎరువుల రూపంలో ఇవ్వాలి. • ఎరువులు ఒక సంవత్సరం మొక్కకు ఇవ్వండి మరియు 10 సంవత్సరాల వరకు ఎరువుల మోతాదు పెరుగుతుంది. జనవరి-ఫిబ్రవరి నెలలో, భాస్వరం పూర్తి మోతాదులో మరియు పొటాషియం మరియు నత్రజని సగం మోతాదులో ఇవ్వండి. • మిగిలిన సగం మోతాదు ఆగస్టులో అందించాలి. బోరాన్ మరియు జింక్ సల్ఫేట్ చెట్ల వయస్సు ప్రకారం ఇవ్వాలి మరియు చౌడు నేలలో 100-500 గ్రాములు ఇవ్వాలి. మూలం: అప్ని ఖేతి
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
171
1
సంబంధిత వ్యాసాలు