గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేసవి పుచ్చకాయ మరియు ఖర్భుజా పంటలో ఈగ వల్ల కలిగే నష్టం మరియు దాని నిర్వహణ పద్ధతులు
• తల్లి పురుగులు కాయలకు రంధ్రాలను చేసి కాయ లోపల గుడ్లను పెడతాయి. • ఉద్బవించిన పురుగు పసుపు లేదా తెల్లటి రంగులో ఉండి కాయ లోపల గుజ్జును తింటుంది. • దెబ్బతిన్న పండ్లు నేల మీద రాలిపోతాయి. • పురుగు సోకిన పండ్లపై ఫంగస్ అభివృద్ధి చెంది కాయలు రాలిపోతాయి. • కాయలు వంకరగా మారుతాయి. • నీరు వంటి రసం రంధ్రం నుండి బయటకు వచ్చి తరువాత గట్టిగా మారి గోధుమ రంగు జిగురులా కనిపిస్తుంది. • నాణ్యత క్షీణిస్తుంది మరియు ఇందువల్ల మార్కెట్ ధర ప్రభావితమవుతుంది. • సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే, 100% వరకు నష్టం జరుగుతుంది.
• వెచ్చని వాతావరణంలో ఈగలు మరింత చురుకుగా ఉంటాయి._x000D_ • దెబ్బతిన్న పండ్లను క్రమానుగతంగా సేకరించి మట్టిలో పాతిపెట్టండి._x000D_ • పొలాన్ని శుభ్రంగా ఉంచండి._x000D_ • పొలం చుట్టూ ఒకటి లేదా రెండు వరుసలలో మొక్కజొన్నను పెంచండి మరియు క్రమానుగతంగా పురుగుమందులను పిచికారీ చేయాలి._x000D_ • వయోజన పురుగుల నియంత్రణ కోసం, 10 లీటర్ల నీటిలో 450 గ్రాముల బెల్లం కరిగించి 24 గంటలు ఉంచండి. 10 మి.లీ డిడివిపి వేసి, పూత రావడం ప్రారంభమైనప్పటి నుండి వారానికి ఒకసారి పంటపై స్ప్రే చేయండి._x000D_ • మగ ఈగలని ఆకర్షించడానికి మరియు చంపడానికి పంట పందిరి పైన ఒక మీటర్ ఎత్తులో ఎకరానికి 8-10 “క్యూ లూర్ ఎరలను” ఏర్పాటు చేయండి._x000D_ • ఆకర్షించబడిన ఈగలను వారంలో రెండుసార్లు ఉచ్చుల నుండి సేకరించి నాశనం చేయండి._x000D_ • పంట వ్యవధిలో ఇటువంటి ఉచ్చులు ప్రభావవంతంగా ఉంటాయి, వీటిని భర్తీ చేయవద్దు._x000D_ • క్షేత్రంలో ఒకదానికొకటి సమాన దూరంలో ఉండేలా ఎరలను ఏర్పాటు చేయండి._x000D_ • చెక్క స్తంభాల సహాయంతో ఎరలను ఏర్పాటు చేసినట్లయితే, చెదపురుగుల గురించి జాగ్రత్త వహించండి._x000D_ • ఉచ్చులు గాలి కారణంగా పడిపోగలవు కాబట్టి అవి సన్నగా ఉండకూడదు._x000D_ • ఉచ్చుకు కుక్కలు లేదా ఇతర జంతువుల వల్ల కలిగే నష్టం గురించి జాగ్రత్త వహించండి._x000D_ _x000D_ వీడియో మూలం: vaibhav jamma MACL SOLAPUR_x000D_ వ్యాసం మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
378
2
ఇతర వ్యాసాలు