వేసవిలో శాస్త్రీయ పద్దతిలో పశువుల నిర్వహణ
పశుసంరక్షణఅగ్రోస్టార్ జంతు సంరక్షణ నిపుణుడు
వేసవిలో శాస్త్రీయ పద్దతిలో పశువుల నిర్వహణ
ఈ వ్యాసంలో పశువులను వేడి నుండి ఎలా రక్షించాలో తెలుసుకుందాం. షెడ్‌లో కొన్ని మార్పులు చేయాలి: • పశువులకు సూర్యరశ్మి నేరుగా ఎక్కువసేపు తగలకుండా ఉండేలా చూడాలి. పైకప్పు మీద ఆవు పేడతో కప్పిన షెడ్‌లో పశువులను ఉంచడం వల్ల ప్రత్యక్ష సూర్యకాంతి పశువుల మీద పడదు. • షెడ్ చుట్టూ గడ్డి, చిన్న మొక్కలను నాటడం వల్ల జంతువుకు వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. • రాత్రిపూట పశువును కంచె వెనుక ఉంచండి. నీరును చల్లడం: వేసవి కాలంలో పశువుల శరీరం మీద చల్లటి నీటిని చల్లడం ద్వారా జంతువు యొక్క శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. షెడ్‌లో ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య మూడు నుంచి నాలుగు సార్లు నీరును చల్లాలి. పెద్ద పాడి పరిశ్రమలలో ఫౌంటైన్ల ద్వారా నీరును చల్లుతారు.
జంతు ఆహారాన్ని మార్చడం: జంతువులకు చల్లగా ఉన్నప్పుడు ఆహారం ఇవ్వాలి, ఉత్తమ గ్రేడ్ మేతను ఆహారంగా ఇవ్వాలి. మూలం: అగ్రోస్టార్ జంతు నిర్వహణ నిపుణుడు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే , లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి .
132
0
ఇతర వ్యాసాలు