సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
దానిమ్మను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను గడించవచ్చు!
• దానిమ్మపండుకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కావున రైతు సోదరులు ఈ పంటను పండించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు._x000D_ • దానిమ్మ మొక్కలు ఫిబ్రవరి-మార్చి మరియు జూలై-ఆగస్టు నెలలో నాటుకోవడం మంచిది. _x000D_ • దానిమ్మ మొక్కలు నాటడానికి ఒక నెల ముందుగానే గుంటలు తయారు చేసుకోవాలి._x000D_ • గుంటలు సిద్ధం చేయడానికి ఏప్రిల్ - మే సరైన సమయం._x000D_ • గుంట యొక్క పరిమాణం 75 * 75 * 75 సెం.మీ పొడవు * వెడల్పు * లోతు ఉండాలి._x000D_ • గుంట సిద్ధమైన తర్వాత ఒకటిన్నర నెలల పాటు గుంటను తెరిచి ఉంచండి, దీని కారణంగా భూమిలో ఉన్న శిలీంధ్రాలు మరియు తెగుళ్ళు నాశనమవుతాయి._x000D_ • జూన్ మొదటి వారంలో, గుంటలను మట్టితో నింపేటప్పుడు మట్టిని శుద్ధి చేయాలి. 1 లీటరు నీటిలో కార్బెండజిమ్ 1 గ్రామును కరిగించి, గొయ్యిని 4 నుండి 5 లీటర్ల ద్రావణంతో నింపండి._x000D_ • క్లోరోపైరిఫాస్ 50 గ్రాములు, 15 కిలోలు బాగా కుళ్ళిన ఆవు పేడ , 2 కిలోల వానపాముల ఎరువు, 1 కిలోల వేప చెక్క బాగా కలిపి గుంటకు ఇవ్వండి._x000D_ • ట్రైకోడెర్మా 25 గ్రాములు, పిఎస్‌బి కల్చర్ 25 గ్రాములు, ఎజెటోబాక్టర్ 25 గ్రాములు మరియు 15 గ్రాముల సూడోమోనాస్ ఎరువు మట్టితో కలిపి గుంటలలో వేయాలి._x000D_ • మొక్కకు మొక్కకు మధ్య 3 మీటర్లు మరియు వరుసకు వరుసకు మధ్య 4 మీటర్ల దూరం ఉండేలా దానిమ్మ మొక్కలను నాటుకోవాలి._x000D_ • మార్కెట్ డిమాండ్ ప్రకారం రకాలను ఎన్నుకోవాలి._x000D_ • దానిమ్మ సాగుకు బిందు సేద్యం అనుకూలంగా ఉంటుంది. ఎరువులను డ్రిప్ ద్వారా సులభంగా ఇవ్వవచ్చు._x000D_ • వ్యాధులు మరియు తెగుళ్ళ యొక్క సరైన నిర్వహణ చేయండి. _x000D_ • ఎకరానికి 300 మొక్కలు నాటుకోవచ్చు, ఒక్కో మొక్కకు 25 కిలోల దిగుబడి వస్తుంది._x000D_ _x000D_ మూలం - అగ్రోస్టార్ అగ్రోనమీ ఎక్సలెన్స్ సెంటర్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి_x000D_ _x000D_
88
1
ఇతర వ్యాసాలు