ప్రిడేటరీ పక్షుల సంరక్షణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ప్రిడేటరీ పక్షుల సంరక్షణ
పక్షులు వివిధ పంటలను దెబ్బతీస్తాయి, అయితే ఇవి తెగులు నిర్వహణకు కూడా సహాయపడుతాయి. కొన్ని ఉపాయాలు మరియు చర్యలను అనుసరించడం ద్వారా ఈ నష్టాన్ని నివారించవచ్చు. భారతదేశంలో మొత్తం 1300 జాతుల పక్షులు ఉన్నట్టు నమోదయ్యింది. పక్షులలో, క్యాటిల్ ఎగ్రెట్, బ్లాక్ డ్రోంగో, మైనా, వాగ్‌టైల్, కాకులు మొదలైనవి ప్రధాన మరియు ముఖ్యమైన పక్షులు.
సుమారు 20 వేర్వేరు జాతుల పక్షులు గొంగళి పురుగులు మరియు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని పక్షులు వివిధ పంటలను నాశనం చేసే, బీటిల్స్, మిడతలు, వెబ్బర్స్ మరియు వివిధ ఆకు తినే గొంగళి పురుగులతో పాటు కూరగాయలు మరియు ధాన్యపు పంటలను దెబ్బతీసే పేనుబంక పురుగులను తింటాయి. ఆముదం మరియు వేరుశనగకు హాని కలిగించే ఆకు తినే గొంగళి పురుగులను నియంత్రించడానికి పక్షుల సహకారం గమనార్హం. అంతేకాకుండా, ఇవి పురుగులను తిని వాటి జనాభాను తగ్గిస్తాయి. పక్షుల ఆహారంలో 50% వివిధ గొంగళి పురుగులు మరియు పురుగులు ఉంటాయి.ఈ పక్షులను సంరక్షించడం మరియు నిర్వహించడం చాలా ముఖ్యం._x000D_ _x000D_ ప్రిడేటరీ పక్షుల సంరక్షణ:_x000D_ · చాలా పక్షులు పొదల్లో గూడు కట్టుకుంటాయి. గూడుకు స్థలం అందుబాటులో లేకపోతే, చెట్లు లేదా స్తంభాలపై లేదా పొలంలో ఉన్న భవనాలపై కృత్రిమ గూడును / గూడు పెట్టెలను ఉంచండి._x000D_ · పొలంలో ఉన్న చెట్లు చాలా పక్షులను ఆకర్షిస్తాయి. అందువల్ల, అటువంటి చెట్లను నరికివేయవద్దు, వాటిని సంరక్షించండి మరియు ఇతర చెట్లను పెంచండి._x000D_ · పొలంలో బొరుగులు(ముర్మారా), శనగలు వంటి ఆహార పదార్థాలను చెల్లాచెదురుగా వేయండి. _x000D_ · పక్షులను ఆకర్షించడానికి పొలంలో పక్షి యొక్క కృత్రిమ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేయండి._x000D_ · పక్షులు కూర్చోవడం కోసం, టి-ఆకారపు చెక్క కర్రలు లేదా తీగలను ఏర్పాటు చేయండి._x000D_ · పక్షులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికి మరియు తెగులు నియంత్రణను పెంచడానికి వ్యవసాయ కార్యకలాపాలను అనుసరించాల్సిన అవసరం ఉంది._x000D_ · ఆహార పదార్థాల అన్వేషణలో పక్షులు ఉదయం (6 గంటలు) మరియు సాయంత్రం (4 నుండి 6 గంటల) సమయంలో చాలా చురుకుగా ఉంటాయి. అందువల్ల, వ్యవసాయ కార్యకలాపాలైన నీటిపారుదల, కోత, దున్నుట మరియు ఇతర వ్యవసాయ కార్యకలాపాలు వాటికి దాణా ఇచ్చే సమయంలో నిర్వహించాలి. అటువంటి వ్యవసాయ కార్యకలాపాలు చేయడం ద్వారా, పక్షి మట్టిలో ఉన్న గొంగళి పురుగులు / ప్యూప / పురుగులను సులభంగా సేకరించగలదు._x000D_ · పొలంలో పక్షులకు తాగునీటిని ఏర్పాటు చేయండి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి._x000D_
481
0
ఇతర వ్యాసాలు