పునరుత్పత్తి దశలో  వరి పంటపై ఈ తెగుళ్ళ యొక్క ముట్టడి అధికంగా ఉంటుంది
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పునరుత్పత్తి దశలో వరి పంటపై ఈ తెగుళ్ళ యొక్క ముట్టడి అధికంగా ఉంటుంది
దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి నాట్లు వేయడం పూర్తయింది, కొన్ని ప్రాంతాల్లో వెన్ను తీయు దశ ప్రారంభం కానుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఈ దశలో దాడి చేసే తెగుళ్ళ నిర్వహణను విశ్లేషిద్దాం. • వరి కాండం తొలుచు పురుగు: వెన్ను ఏర్పడే దశలో పురుగు కాండం లోపల భాగాన్ని తినడం వల్ల మొవ్వులు ఎండిపోతాయి. పర్యవసానంగా గింజ లేని తెల్లటి కంకులు బయటకు వస్తాయి. పురుగు సోకిన పిలకలను లాగితే అవి తేలికగా బయటకు వస్తాయి. సాధారణంగా వరి పంటలో ఈ తెల్ల కంకి సమస్య వస్తుంది. • వరి ఆకు ముడత పురుగు: పురుగు ఆకు యొక్క అంచులను అంటించి ఆకును చుట్టినట్టు చేస్తుంది ఈ ఆకులో పురుగు చేరి హరిత పత్రాన్ని భుజిస్తుంది. పురుగు ఆశించిన ఆకులకు తెల్లటి గీతాలు పడతాయి. పురుగు యొక్క ముట్టడి అధికంగా ఉన్నప్పుడు ఆకులు తెల్లగా మారి చివరకు ఎండిపోతాయి. • వరి దోమ: దోమ కాండం దిగువ భాగం నుండి రసం పీలుస్తుంది. పర్యవసానంగా, పైరు పసుపు వర్ణానికి మారుతుంది, ఇది త్వరలో గోధుమ రంగులోకి మారి తర్వాత ఎండిపోతుంది. వలయాకారంలో మొక్కలు ఎండిపోతూ ఉంటాయి దీనినే హాపర్ బర్న్ అంటారు. ముట్టడి సాధారణంగా పొలం మధ్య నుండి మొదలై వలయాకారంలో వ్యాప్తి చెందుతుంది. పురుగు సోకిన పొలంలో వెన్ను రాకపోవడం లేదా ధాన్యం లేకుండా ఉండడం మరియు పొట్టు మృదువుగా ఉండడాన్ని గమనించవచ్చు. • రైస్ స్కిప్పర్: లార్వా ఆకు యొక్క అంచులను అంటించి ఆకులను గొట్టాలుగా చుట్టి దానిలో ఉండి ఆకును తింటుంది. ఇది గొట్టాలలో ఉండి ఆకులను కత్తిరిస్తుంది. • కొమ్ము గొంగళి పురుగు: పురుగు తల భాగంలో రెండు ఎర్ర కొమ్ములు ఉంటాయి. ఇది ఆకు అంచుల నుండి తినడం మొదలుపెట్టి ఈనె వరకు తింటుంది. • బ్లూ బీటిల్: పురుగు ఆకుల మీద ఉన్న ఆకుపచ్చ పదార్థాన్ని తింటుంది. పురుగు ఆకును తిన్నప్పుడు, ఆకు యొక్క మధ్య ఈనెకు సమాంతరంగా తెల్లటి ప్యాచ్ లు కనిపిస్తాయి. • వరి కంపునల్లి: ఈ పురుగు నుండి కంపు వాసన వస్తుంది కావున దీనిని కంపునల్లి అంటారు. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు గింజ పాలు పోసుకునే దశలో గింజ నుండి రసాన్ని పీలుస్తాయి. పర్యవసానంగా, ధాన్యాలు పరిపక్వం చెందవు మరియు గింజలు తాలు పోతాయి. • కత్తెర పురుగు: దీనిని "పానికిల్ కట్టర్ లార్వా" అని కూడా పిలుస్తారు. పురుగు కంకులను కత్తిరిస్తుంది, దీన్ని భూమి యొక్క ఉపరితలంపై చూడవచ్చు. • షీత్ మైట్స్: ఈ పురుగు ఆకుల నుండి రసాన్ని పీలుస్తుంది మరియు దీనివల్ల ఫంగస్ (షీత్ రోట్) ఆకులోకి సులభంగా మరియు వేగంగా ప్రవేశిస్తుంది. తత్ఫలితంగా, అన్ని ధాన్యాలు ఈనెపై ఉండవు మరియు గోధుమ రంగులోకి మారుతాయి. • పీతలు: అవి నీటి మట్టానికి మొక్కను తుంచివేస్తాయి. అదనంగా, కట్ట మీద రంధ్రాలు చేస్తాయి, దీని ఫలితంగా వరి పొలం నుండి నీరు బయటకు పోతుంది. • ఎలుకలు: అవి పరిపక్వమైన ఈనెలను కత్తిరించి వాటిని రంధ్రాలలో భద్రపరుస్తాయి.
రసాయనాల నిర్వహణ • మొక్కలు ప్రధాన పొలంలో నాటడానికి ముందు, వరి పిలకల వేర్లను 0.02% క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి + 1% యూరియా ద్రావణంలో 4 గంటల పాటు ఉంచండి. • మొక్క నాటిన 10 - 15 రోజుల తరువాత 1 కిలో ఆక్టివ్ ఇంగ్రిడిఎంట్ ఉన్న క్వినాల్ఫోస్ గుళికలును హెక్టారుకు చొప్పున ఇవ్వండి. • కాండం తొలుచు పురుగులు మొదటి దశలో ఉన్నప్పుడు 7 రోజుల విరామంలో 2 సార్లు క్వినాల్ఫోస్ లేదా ఫాస్ఫోమిడాన్‌ 0.5 కిలోల ఆక్టివ్ ఇంగ్రిడిఎంట్ హెక్టారుకు చొప్పున ఇవ్వండి. • మలాథియాన్‌ పొడి చల్లడం వల్ల కంపునల్లి పురుగును సంపూర్ణంగా నివారించవచ్చు. • కత్తెర పురుగు ముట్టడి ఉన్నట్లయితే, సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్ర సమయంలో నువాన్ 0.5 కిలోల ఆక్టివ్ ఇంగ్రిడిఎంట్ ను పంట మీద పిచికారీ చేయండి జీవ నియంత్రణ: • కాండం తొలుచు పురుగు గుడ్డు పెట్టే దశలో దీని పరాన్నజీవి ట్రైకోగ్రామా జపోనికమ్ వారం వ్యవధిలో హెక్టారుకు 50,000 చొప్పున పొలంలో విడుదల చేయడం వల్ల చాలా ప్రభావవంతంగా ఉంటుంది • మిర్డ్ బగ్ సైటోరినస్ లివిడిపెన్నిస్ 50 - 75 గుడ్డు / చదరపు మీటరుకు విడుదల చేయండి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
378
5
ఇతర వ్యాసాలు