AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సోయాబీన్ పంట కోత సమయంలో ఈ పద్దతులను అనుసరించండి
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
సోయాబీన్ పంట కోత సమయంలో ఈ పద్దతులను అనుసరించండి
అంకురోత్పత్తి మరియు రాబోయే సంవత్సరాల్లో పండించే పంటల నుండి నాణ్యమైన ఉత్పత్తి పొందుటకు సోయాబీన్ కాయ పండిన సమయం నుండి కోత వరకు వాతావరణ పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. విత్తనం పండిన దశలో తేమ తగ్గుతుంది. ఈ కాలంలో, స్థిరమైన వర్షపాతం పంటకు చాలా హాని కలిగిస్తుంది. కాయలు పండిన తర్వాత పంట కోత అవసరం మరియు నష్టాన్ని తగ్గించడానికి వర్షాకాలంలో విత్తనాలలో తేమ శాతం 14-16% మధ్య ఉండాలి.
పంటను కోసేటప్పుడు, పొలంలో కలుపు మొక్కలు ఉంటే, పంటతో పాటు వీటిని కోయకుండా జాగ్రత్త వహించండి. పొలంలో మొలచిన కలుపు మొక్కలను పంటను కోయడానికి ముందే పంట నుండి వేరుచేసి నాశనం చేయాలి. అలాగే, కాయలు అభివృద్ధి చెందే దశలో డయాథేన్-ఎం -45 అను శిలీంద్ర సంహారిణి @ 25-35 గ్రాముల పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. ఇది విత్తన ద్వారా సంక్రమించు తెగుళ్లను నియంత్రించడం ద్వారా అంకురోపత్తిని పెంచుతుంది. పంట కోత ఒక కొడవలి సహాయంతో చేయాలి. పంట కోసేటప్పుడు మొక్కలు కోయకుండా లేదా రాళ్లు విత్తనంలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పండించిన పంట విత్తనాన్ని కుప్పలా వేయకూడదు, ఇది అంకురోత్పత్తిపై ప్రభావం చూపుతుంది మరియు విత్తనం యొక్క నాణ్యతను కాపాడటానికి సూర్యకాంతి క్రింద విత్తనాన్ని పొలంలో ఎండబెట్టాలి. సోయాబీన్స్ పెద్ద మొత్తంలో పండిస్తున్నట్లయితే , సమయం మరియు వ్యయాన్ని ఆదా చేయడానికి 'కంబైన్ హార్వెస్టర్' తో కోత చేయడం మంచిది. ఈ సమయంలో, హార్వెస్టింగ్ బ్లేడ్లు భూస్థాయి నుండి 8 నుండి 10 సెం.మీ ఉండాలి మరియు యంత్ర వేగం మీడియం స్థాయిలో ఉండాలి. ఈ విధంగా, సోయాబీన్ పంట యొక్క కోతను పరిశీలనతో చేయాలి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
427
3