AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సొరకాయ పంటలో పండు ఈగల నిర్వహణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
సొరకాయ పంటలో పండు ఈగల నిర్వహణ
ప్రత్యేకించి, సొరకాయ జాతి పంటలలో అంటే పొడుగు దోసకాయ, కాకరకాయ, గుమ్మడి కాయ, దోసకాయ, బీరకాయ, పుచ్చకాయ, దొండకాయ వంటి అనేక పంటలలో పండు ఈగ చాలా నష్టం కలిగిస్తుంది. సొర జాతి పంటలకు గాటు పెట్టిన తర్వాత, అది మెత్తగా మారిపోతుంది. ఆ తరువాత అది గోధుమ రంగులోకి మారుతుంది. అంతర్గత పదార్ధంపై లార్వా ఏర్పడడం మరియు లోపలి వైపు రంధ్రాలు పడడం, ఇంకా కుళ్లిపోవడం సంభవిస్తుంది. తెగులు సోకిన కాయలు క్రమంగా రాలిపోతాయి. మార్చి, ఏప్రిల్ నెలలలో ఇది సోకే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
నిర్వహణ: _x000D_  పండు ఈగల ప్యూపా (గుడ్డు దశ)ను నాశనం చేయడం లోతుగా దున్నండి._x000D_  తెగులు సోకిన కాయలు పండ్లను పోగు చేయండి మరియు 15 సెం.మీ. లోతుగా పాతిపెట్టండి._x000D_  పంట కోతకు వచ్చే ముందు క్రమం తప్పకుండా కాయలు పోగు చేయండి._x000D_  ఒక హెక్టారుకు 16 చొప్పున నిర్ణీత సమాన దూరంలో ఉచ్చులను ఏర్పాటు చేయండి_x000D_  ఈ పండు ఈగలను నియంత్రించడానికి పురుగు మందుల స్ప్రే అంతగా ఉపయోగపడకపోవచ్చు._x000D_  విషపు ఎరను ఉపయోగించడం ద్వారా పండు ఈగలను ఆకర్షించి, వాటిని నాశనం చేయండి._x000D_  విషపు ఎర సిద్ధం చేయడం: 10 లీటర్ల నీటిలో 500 గ్రాముల బెల్లం కరిగేలా చేసి, ఒక రాత్రి అంతా దానిని నిల్వ చేయండి. రెండవ రోజున అదనంగా 40 లీటర్ల నీరు + క్వినాల్ఫాస్ 25 ఈసీ 50 మి.లీ జోడించి బాగా కలపండి. ఈ ద్రావకాన్ని పొలంలో స్ప్రే చేయండి. _x000D_  ఒక వారం తర్వాత ఈ స్ప్రే చేయడం మరోసారి తిరిగి చేయండి. _x000D_ _x000D_ డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
149
0