AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
శనగ పంటలో కాయ తొలుచు పురుగు నిర్వహణ (ఐపిఎం)
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
శనగ పంటలో కాయ తొలుచు పురుగు నిర్వహణ (ఐపిఎం)
శీతాకాలంలో భారతదేశం అంతటా శనగ పంటను సాగునీరుతో లేదా సాగునీరు లేకుండా కూడా సాగు చేస్తున్నారు. విత్తనాలు వేయడం నుండి పంట కోత వరకు, “కాయ తొలుచు పురుగు” పంటకు హాని కలిగిస్తుంది. కొత్తగా ఉద్భవించిన పురుగులు మొదట లేత ఆకుల లేదా కాయల ఎపిడెర్మల్ పొరను గీకుతాయి. ఈ పురుగు ప్రకృతిలో పాలిఫాగస్ గా ఉంటుంది మరియు ఇవి విపరీతంగా తినడం వల్ల అనేక పంటలకు హాని కలిగిస్తుంది. కాయ ఏర్పడే సమయంలో, పురుగు కాయ మీద రంధ్రం చేసి, కాయ లోపలి వెళ్లి అభివృద్ధి చెందుతున్న విత్తనాలను తింటుంది. పురుగు పూర్తిగా కాయలోకి ప్రవేశించిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చెందిన విత్తనాలను తింటుంది. _x000D_ నిర్వహణ:_x000D_ • లింగాకర్షణ బుట్టలను హెక్టారుకు 40 చొప్పున ఏర్పాటు చేయండి. _x000D_ • సమీపంలో విద్యుత్తు సౌకర్యం ఉన్నట్లయితే, ఒక దీపపు ఎరను ఏర్పాటు చేయండి._x000D_ • హెక్టారుకు HaNPV @ 250 LU మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ • పక్షులను ఆకర్షించడానికి టి-ఆకారంలో చెక్కలను ఏర్పాటు చేయండి. _x000D_ • ముట్టడి యొక్క ప్రారంభ దశలో, బ్యూవేరియా బస్సియానా అను ఫంగస్ బేస్డ్ పురుగుమందును @ 40 గ్రాములు లేదా బాసిల్లస్ తురింజెనిసిస్ అను బ్యాక్టీరియా బేస్ పౌడర్ను @ 15 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ • పచ్చి కాయల కోసం పంటను పండిస్తే రసాయన పురుగుమందులను పిచికారీ చేయవద్దు. దానికి బదులుగా, 10 లీటర్ల నీటికి వేప ఆధారిత సూత్రీకరణలు @ 20 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ • ముట్టడి ప్రారంభ దశలో నాఫాటియా లేదా అర్దుషి లేదా కద్వి మెహదీ లేదా జట్రోపా ఆకుల సారం @ 5% కాయ తొలుచు పురుగు నియంత్రణ కోసం పిచికారీ చేయవచ్చు._x000D_ • వీలైతే, పొలంలో మరియు చుట్టుపక్కల బంతి మొక్కలను ఎర పంటగా పెంచండి._x000D_ • పురుగు ముట్టడి అధికంగా ఉన్నట్లయితే, ఫెన్వాలరేట్ 20 ఇసి @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహెలోథ్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా లుఫెనురాన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా థియోడికార్బ్ 75 డబుల్ల్యు పి @ 20 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్ సి @ 3 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్జీ @ 5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 20 డబుల్ల్యుజి @ 5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ • పెద్ద గొంగళి పురుగులు పురుగుమందుల ద్వారా నియంత్రించబడకపోవచ్చు. కావున వాటిని చేతితో సేకరించి నాశనం చేయడం మంచిది._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి._x000D_
378
1