AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వ్యవసాయం, రైతులు మరియు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి గాను 'పీఎం కిసాన్ సంపద యోజన'
కృషి వార్తAgrostar
వ్యవసాయం, రైతులు మరియు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి గాను 'పీఎం కిసాన్ సంపద యోజన'
న్యూఢిల్లీ: ప్రధాన్ మంత్రి కిసాన్ సంపాద యోజన (పిఎంకెఎస్‌వై) క్రింద ఆహార ప్రాసెసింగ్ రంగంలో సుమారు 32 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. సుమారు 17 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులను అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకం క్రింద సుమారు 406 కోట్లు ఆమోదించబడ్డాయి._x000D_ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి?_x000D_ 1. ఈ ప్రాజెక్టు క్రింద సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పిస్తారు._x000D_ 2. ఆధునిక ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వృధాని తగ్గిస్తాయి, తద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది._x000D_ 3. భారతీయ రైతులు అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో వినియోగదారులతో కనెక్ట్ అవుతారు._x000D_ పీఎం కిసాన్ సంపద యోజన అంటే ఏమిటి?_x000D_ ఈ పథకం ఆగస్టు 2017 లో ప్రారంభమైంది. వ్యవసాయాన్ని ఆధునీకరించడం, వ్యవసాయ వ్యర్థాలను తగ్గించడం మరియు ఆధునిక మౌలిక సదుపాయాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. వ్యవసాయ అభివృద్ధిలో సరైన నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలి. రైతులు తమ ఉత్పత్తులకు సరైన మరియు మంచి ధర పొందాలి. ఇవే కాకుండా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు._x000D_ మూలం: కృషి జాగ్రన్, 3 మార్చి 2020_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి._x000D_ _x000D_ _x000D_
572
0