గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేసవి కాలంలో వేసే వేరుశనగ పంటలో ఆకు తినే గొంగళి పురుగులు పంటకు కలిగించే నష్టం మరియు వాటి నియంత్రణ విధానం
• వేసవిలో వేరుశనగను అనేక రాష్ట్రాల్లో సాగు చేస్తారు._x000D_ • పంట ప్రారంభ దశలో ఈ పురుగుల ముట్టడి ఎక్కువగా ఉంటుంది._x000D_ • అధిక తేమ ఉన్నట్లయితే, ఆకు తినే గొంగళి పురుగుల ముట్టడి ఎక్కువగా ఉంటుంది._x000D_ • గొంగళి పురుగులు ప్రారంభ దశలో ఆకులను గీకుతాయి మరియు లేత ఆకులను తింటాయి, తరువాతి దశలో, పురుగులు ఆకుల ఈనెలను వదిలి మిగతా ఆకు భాగాన్ని తింటాయి._x000D_ • మధ్యాహ్న సమయంలో, గొంగళి పురుగులు మొక్కల కాండం దగ్గర మట్టిలో లేదా మట్టి యొక్క పగుళ్లలో దాక్కుంటాయి._x000D_ • పంట యొక్క పునరుత్పత్తి దశలో ఈ పురుగు యొక్క జనాభాను గమనించినట్లయితే, అవి మట్టిలో అభివృద్ధి చెందుతున్న కాయలను కూడా నాశనం చేస్తాయి._x000D_ • పొలంలో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయండి._x000D_ • పురుగు యొక్క ముట్టడి ప్రారంభ దశలో, వేప ఆధారిత సూత్రీకరణ @ 20 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) లేదా బ్యూవేరియా బస్సియానా అను ఫంగస్ బేస్ పౌడర్ @ 40 గ్రాములు లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ అను బ్యాక్టీరియా బేస్ పౌడర్ @ 10 గ్రాములు లేదా ఎస్ఎన్పివి 250 ఎల్ఈ @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. _x000D_ • తెగులు ముట్టడి ప్రారంభమైనప్పటి నుండి 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 30 మి.లీ పొంగామియా ఆయిల్ (కరంజ్ ఆయిల్) లేదా పొన్నీమ్ కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. పొన్నీమ్ తయారు చేయడానికి గాను 450 మి.లీ వేప నూనె + 450 మి.లీ పొంగమియా నూనె (కరంజ్ ఆయిల్) + 100 మి.లీ సబ్బు నీళ్లు కలపాలి(జునాగఢ్ యూనివర్సిటీచే సిఫారసు చేయబడింది)._x000D_ • పురుగుల ముట్టడి అధికంగా ఉన్నట్లయితే, థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా సైహెలోథ్రిన్ 9.5% జెడ్‌సి @ 4 మి.లీ లేదా మెథొమైల్ 40 ఎస్పి @ 12 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి. _x000D_
39
3
ఇతర వ్యాసాలు