కీటకాల జీవిత చక్రంICAR-DIRECTORATE OF GROUNDNUT RESEARCH
వేరు లద్దె పురుగు (వైట్ గ్రబ్) యొక్క జీవిత చక్రం
ఇది పాలీఫాగస్ తెగులు, ఇది ప్రధానంగా చెరకు మరియు వేరుశనగ పంటలను ఆశిస్తుంది. వేరు లద్దె పురుగులో రెండు జాతులు ఉన్నాయి అవి హోలోట్రిచియా కన్సాన్గునియా మరియు హోలోట్రిచియా సెరటా ఇవి చెరకు, కొబ్బరి, వక్కలు, పొగాకు, బంగాళదుంప, నూనె గింజలు, పప్పుధాన్యాలు మరియు కూరగాయలు మొదలైన పంటలను ఆశిస్తాయి._x000D_ _x000D_ •వేరు లద్దె పురుగు (వైట్ గ్రబ్), హోలోట్రిచియా కాన్సాంగూనియా 76-96 రోజుల్లో దాని జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది._x000D_ •గుడ్డు దశ 8-10 రోజులు, లార్వా దశ 56–70 రోజులు మరియు పూప దశ 12–16 రోజులు ఉంటుంది మరియు హెచ్. సెరటా 141–228 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది, ఇందులో గుడ్డు దశ 10 -12 రోజులు , లార్వా దశ 121-202 రోజులు మరియు ప్యూప దశ 10-14 రోజుల పాటు ఉంటుంది._x000D_ •వేరు పురుగులు వర్షాకాలంలో (జూలై-అక్టోబర్) వాటి రెండవ, మూడవ మరియు నాల్గవ ఇన్‌స్టార్ లార్వా దశలలో చురుకుగా ఉంటాయి మరియు జీవంతో ఉన్న మొక్కల వేర్లు దొరికే వరకు సేంద్రియ పదార్థాలను తింటాయి. గుడ్లు తెల్లగా గుండ్రని ఆకారంలో ఉంటాయి._x000D_ •పిల్ల పురుగులు తెలుపు రంగులో ఉంటాయి. పరిపక్వానికి వచ్చిన పురుగులు లేత రంగులో మరియు 'సి' లేదా సెమీ వృత్తాకారంలో ఉంటాయి. ప్యూపేషన్‌కు ముందు పురుగు ఆహారం తినడం మానేసి మట్టిలో 40-70 సెం.మీ దిగువకు చేరుకుంటుంది._x000D_ •పురుగు ప్యూపేషన్ కోసం ఒక మట్టి గదిని సిద్ధం చేస్తుంది._x000D_ •తరువాతి రుతుపవన వర్షాలు వచ్చే వరకు బీటిల్స్ ఒక మీటరు లోతులో క్రియారహిత స్థితిలో ఉంటాయి. ఈ కారణంగా దీనిని జూన్ బీటిల్ అని కూడా పిలుస్తారు._x000D_ •వేరు పురుగు యొక్క అన్ని జాతులు వేరుశనగపై దాడి చేస్తాయి, సంవత్సరానికి ఒకే తరం చురుకైన లార్వా డయాపాజ్ దశతో ఉంటుంది._x000D_ _x000D_ నిర్వహణ: _x000D_ •వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం ద్వారా ప్యూప సూర్యకాంతికి మరియు పక్షులకు బహిర్గతం అవుతాయి. _x000D_ •బాగా కుళ్ళిన సేంద్రియ ఎరువులను వాడండి._x000D_ _x000D_ •జొన్నలు మరియు సజ్జ పంటలతో పంట మార్పిడి చేయండి. _x000D_ •మొదటి రుతుపవనాల వర్షం కురిసిన తరువాత దీపపు ఎరలను @ 1 / హెక్టారుకు సాయంత్రం 7 నుండి 10మధ్య ఉంచండి._x000D_ _x000D_ మూలం: ఐసిఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
4
0
సంబంధిత వ్యాసాలు