క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేపసారం తయారీ విధానం
వేప విత్తనాలు క్రిమిసంహారకాలుగా ఉపయోగపడతాయి. ప్రత్యేక గుణాలున్న వేపసారంతో కీటకాలు, నులిపురుగులు, ఫంగస్ వంటివాటిని నియంత్రించవచ్చు. 10% వేప సారం తయారుచేయటానికి అనుసరించాల్సిన పద్దతి 1 ) 10 కిలోల వేప గింజలు మరియు బట్టలసోడాను 100 గ్రాములు తీసుకోవాలి. 2 ) ఎండిన వేప గింజలను పొడిగా మార్చి ఒక గుడ్డలో కట్టాలి. 3 ) 10 లీటర్ల నీటిని తీసుకుని అందులో వేపపొడిని 10 నుండి 12 గంటలు పాటు నానబెట్టండి. 4) నానపెట్టిన వేప పొడిని గట్టిగా 10 నుండి 15 నిమిషాలు అదిమిపట్టి నొక్కండి. తర్వాత గుడ్డలో మిగిలిన వేపపొడి సారాన్ని తీసుకోవాలి. 5 ) గుడ్డలో నుంచి తీసిన వేపసారాన్ని 90 నుండి 100 లీటర్ల నీటిలో కలపి, క్రిమిసంహారక మందుగా పిచికారీ చేయాలి.
వేపసారం తయారుచేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు • పంట వివిధ దశల్లో తెగుళ్ళ బారీన పడకుండా వేపసారం కాపాడుతుంది. • సిద్ధం చేసిన సారాన్ని వెంటనే వినియోగించాలి. దీనిని ఎక్కువసమయం నిల్వ చేయవద్దు. • తెగుళ్ల స్థాయిని బట్టి వేపసారం మోతాదును పెంచండి.
5
0
సంబంధిత వ్యాసాలు