AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
విత్తే కాలం, పంట దూరం మరియు విత్తన రేటు తెగుళ్లపై ఎలా ప్రభావం చూపుతాయి
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
విత్తే కాలం, పంట దూరం మరియు విత్తన రేటు తెగుళ్లపై ఎలా ప్రభావం చూపుతాయి
• విత్తనాలు / మొక్కలు దగ్గరగా నాటడం వల్ల పంటలలో తెగుళ్ల సంభవం ఎక్కువగా ఉంటుంది. • మొక్కలను దగ్గరగా నాటడం వల్ల తగినంత సూర్యరశ్మి మొక్కకు అందక తేమ పెరుగుతుంది, ఇది తెగుళ్ల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితిని కలుగజేస్తుంది. • వరి నాటుకునేటప్పుడు రెండు వరుసల మధ్య దూరం తక్కువగా ఉండడం వల్ల, దోమ మరియు ఆకు ముడత పురుగు యొక్క జనాభా ఎక్కువగా ఉంటుంది. • రెండు అడ్డు వరుసల మధ్య తక్కువ దూరంలో చెరుకు పంటను విత్తినట్లయితే చెరకు పంటలో కాండం తొలుచు పురుగుల ముట్టడి చాలా ఎక్కువగా ఉంటుంది.
• ప్రత్తి పంటలో రెండు మొక్క వరుసల మధ్య దూరం తక్కువగా ఉన్నట్లయితే వివిధ రకాల రసం పీల్చు పురుగులు ముట్టడి పెరుగుతుంది. • వేరుశనగ పొలంలో మొక్కలు దగ్గరగా నాటడం వల్ల పేనుబంక పురుగుల ముట్టడి తగ్గుతుంది. • విత్తే కాలంలో మార్పు వివిధ తెగుళ్ళపై ప్రభావం చూపుతుంది. • అక్టోబర్ మొదటి పక్షంలో ఆవాలు పంట విత్తినట్లయితే, పేనుబంక మరియు సాఫ్ ఫ్లై సంక్రమణ చాలా తక్కువగా ఉంటుంది. • త్వరగా నాటిన జొన్న పంటలో షూట్ ఫ్లై వల్ల కలిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. • ఫిబ్రవరి రెండవ పక్షంలో నాటిన పేసర్లు మరియు మినుములు వంటి పంటలు తెగులు బారిన పడతాయి. • డిసెంబరులో నాట్లు వేసిన క్యాబేజీ పంటను పేనుబంక పురుగులు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. • త్వరగా (మే చివరి వారం) నాటిన ప్రత్తి పంటలో వివిధ రసం పీల్చే పురుగుల వల్ల కలిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. • ఆగస్టు మొదటి పక్షంలో నాటిన మొక్కజొన్న పంటలో కాండం తొలుచు పురుగు సంభవం చాలా తక్కువగా ఉంటుంది. • విత్తన రేటును సిఫారసు చేసినదానికంటే ఎక్కువగా విత్తడం వల్ల షూట్ ఫ్లై వల్ల కలిగే నష్టం పెరుగుతుంది. • అందువల్ల, సిఫార్సు చేసిన సమయంలో విత్తడం, రెండు వరుసల మధ్య దూరం ఉంచడం మరియు వ్యవసాయ యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ ఇచ్చిన విత్తన రేటు ప్రకారం పంటలను విత్తి మీ పంటలను వివిధ తెగుళ్ళ నుండి రక్షించండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
295
0