కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వంకాయ కాయ మరియు కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం
కాండం మరియు కాయ తొలుచు పురుగు అనేది వంకాయ పంటలో వచ్చే ప్రధాన తెగులు. ఇది 30 -50% పండ్లు లేదా అంతకంటే ఎక్కువ పండ్లకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు యొక్క దశలను మరియు దానిని నియంత్రించే మార్గాలను మనం తెలుసుకుందాం. గుడ్లు: తల్లి పురుగులు ఆకు క్రింద మరియు పూల మొగ్గలపై గుడ్లను పెడతాయి. గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి. గుడ్డు దశ 3 -5 రోజుల పాటు ఉంటుంది. లార్వా: లార్వా గులాబీ రంగులో ఉంటుంది. ఈ దశ 12-15 రోజుల పాటు ఉంటుంది. గుడ్డు పొదిగిన తరువాత, లార్వా కాండం మరియు కాయలలోకి ప్రవేశించి లోపల భాగాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ప్యూపా: నేల మీద ఉన్న ఎండిన ఆకులలో ప్యూపా ఉంటుంది. ఈ దశ 6-17 రోజుల పాటు ఉంటుంది. ప్యూపా బూడిద రంగులో పడవ ఆకారంలో ఉంటుంది. వయోజన పురుగులు: మధ్య తరహా చిమ్మటకు ముందు ఉన్న తెల్లటి రెక్కల మీద నలుపు మరియు గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. వెనుక రెక్కల మీద నల్ల చుక్కలు అస్పష్టంగా ఉంటాయి. ఆడ వయోజన చిమ్మట 250 గుడ్లను పెడుతుంది.
నష్టం యొక్క లక్షణాలు: • కొమ్మల చివర్ల మొక్క వాడిపోయినట్టు కనిపిస్తుంది మరియు మొక్క పెరుగుదల ఆగిపోతుంది. • కొమ్మలు మరియు కాయలపై రంధ్రాలు కనిపిస్తాయి మరియు అవి పురుగు యొక్క మలమూత్రకాలతో నింపబడి ఉంటాయి. • పూల మొగ్గల రాలిపోతాయి. • ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. నిర్వహణ: • పురుగు ఆశించిన మొక్కలను తొలగించి నాశనం చేయండి. • పురుగు తొలచిన పండ్లను సేకరించి వాటిని నాశనం చేయండి. • ఎకరానికి 5 - 6 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయండి. • మొక్కలపై పురుగు యొక్క గుడ్లను గమనించినప్పుడు నీమాస్త్రం పిచికారీ చేయండి. • లోతైన వేసవి దుక్కులు చేయండి. • థియాక్లోప్రిడ్ 21.70% ఎస్సీ @ 300 మి.లీ లేదా థియోడికార్బ్ 75% డబ్ల్యుపి @ 400 గ్రాములు లేదా సైపర్‌మెథ్రిన్ 3% + క్వినాల్‌ఫోస్ 20% ఇసి @ 160 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
28
0
సంబంధిత వ్యాసాలు