AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వంకాయలలో కాండం మరియు కాయ తొలుచు పురుగు యొక్క ఇంటిగ్రేటెడ్(సమీకృత) నిర్వహణ
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వంకాయలలో కాండం మరియు కాయ తొలుచు పురుగు యొక్క ఇంటిగ్రేటెడ్(సమీకృత) నిర్వహణ
• పాడైపోయిన వంకాయ మొక్కలను మరియు పురుగుల బారిన పడిన పండ్లను తొలగించి వేయాలి • వంకాయ మొక్కలలో పూత పూసే ముందు, ఎకరానికి 4 నుంచి 6 ఫేరోమోన్ ఉచ్చులను అమర్చాలి. ఈ ఉచ్చు పొలంలో పంట మీద ఎత్తులో ఉంచబడుతుంది, తద్వారా పురుగులు ఆకర్షించబడతాయి. • ఒక ఎకరా ప్రాంతంలో ఒక కాంతి ఉచ్చును అమర్చాలి.
• పురుగులను నియంత్రించడానికి, ఎకరాకు 2 నుండి 3 చొప్పున ట్రైకోగ్రామా సిలోనిస్ జాతుల ట్రైకో కార్డులను అమర్చాలి. • BT బయోలాజికల్ క్రిమిసంహారక ద్రావణాన్ని , వంకాయ మొక్కలకు లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. • 15 రోజుల వ్యవధిలో లీటర్ నీటికి 3 మి.లీ నీమార్క్ 5% లేదా అజాడిరాచ్టిన్ (300 ppm) కలిపి పిచికారి చేయాలి. అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
931
6