AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
రబీ పంట సాగు 600 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
రబీ పంట సాగు 600 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది
న్యూ ఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో రబీ పంటల సాగు 600.32 లక్షల హెక్టార్లకు పెరిగింది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 38.37 లక్షల హెక్టార్లుగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 561.95 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలను సాగు చేసారు. అక్టోబర్, నవంబర్‌లలో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నందున గోధుమలతో పాటు పప్పుధాన్యాలు, తృణధాన్యాలను విత్తడం పెరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రధాన రబీ పంట అయిన గోధుమ పంటను ప్రస్తుత సీజన్లో 312.81 లక్షల హెక్టార్లలో సాగు చేసారు, ఇది సాధారణ విస్తీర్ణం 305.58 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ. గత సంవత్సరం ఈ సమయానికి 286.23 లక్షల హెక్టార్లలో గోధుమ పంటను సాగు చేసారు. పప్పుధాన్యాల పంటను ప్రస్తుత రబీ సీజన్లో 146.24 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు, గత ఏడాది పప్పుధాన్యాలను 142.22 లక్షల హెక్టార్లలో సాగు చేసారు. రబీ పప్పుధాన్యాల ప్రధాన పంట అయిన శనగ సాగు గత ఏడాది 93.19 లక్షల హెక్టార్ల నుండి 98.52 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రస్తుత రబీలో ఇతర పప్పుధాన్యాలు 5.24 లక్షల హెక్టార్లలో విత్తడం జరిగింది, అయితే గత సంవత్సరం ఈ సమయానికి పప్పుధాన్యాలను 5.52 లక్షల హెక్టార్లలో విత్తారు. మూలం: ఔట్లుక్ అగ్రికల్చర్, 03 జనవరి 2020
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_ _x000D_
1274
0