AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మొక్కజొన్న పంటను ఆశించే కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మొక్కజొన్న పంటను ఆశించే కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం
మొక్కజొన్న పంటను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో కాండం తొలుచు పురుగు ఒకటి. ఈ పురుగు గురించి మరింత తెలుసుకుందాం._x000D_ _x000D_ గుడ్లు: గుడ్లు పలుచగా, గుడ్రంగా మరియు తెలుపు రంగులో ఉంటాయి. ప్రారంభ దశలో గుడ్లు ముత్యపు తెలుపు రంగులో కనిపిస్తాయి క్రమేపి ఇవి ముదురు రంగులోకి మారుతాయి. 4-7 రోజుల్లో గుడ్లు పొదుగుతాయి._x000D_ _x000D_ లార్వా: లార్వా గోధుమ రంగు తలతో పసుపు గోధుమ రంగులో ఉంటుంది. లార్వా కాలం సుమారు 29-36 రోజుల పాటు ఉంటుంది._x000D_ _x000D_ ప్యూప: ప్యూప స్థూపాకారంలో లేత గోధుమ రంగులో ఉంటుంది. ప్యూప కాలం 11-12 రోజుల పాటు ఉంటుంది._x000D_ _x000D_ _x000D_ వయోజన పురుగు:_x000D_ మగ చిమ్మట ముదురు గోధుమ రంగులో ఉండి, ముందు రెక్కలు లేత గోధుమ రంగులో మరియు వెనక రెక్కలు లేత పసుపు రంగులో ఉంటాయి. ఆడ పురుగు యొక్క వెనక రెక్కలు మగ పురుగు యొక్క రెక్కల కన్నా రంగు తక్కువగా ఉంటాయి. వయోజన పురుగులు 8-9 రోజుల పాటు ఉంటుంది._x000D_ _x000D_ నష్టం యొక్క లక్షణాలు: _x000D_ • పురుగు కాండంలోకి ప్రవేశించి మొక్క చనిపోయేలా చేస్తుంది._x000D_ • పురుగు కాండంలోకి ప్రవేశించి కాండం యొక్క అంతర్గత భాగాలను తినడం వల్ల మొక్క వాడిపోతుంది. _x000D_ • చిన్న పురుగు ముడుచుకున్న లేత ఆకులపై తిరుగుతూ వాటిని తింటుంది. _x000D_ నిర్వహణ:_x000D_ _x000D_ • ముందు పంట యొక్క కొమ్మలను మరియు మొక్క భాగాలను సేకరించి నాశనం చేయాలి. _x000D_ • పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. _x000D_ • పురుగు సోకిన భాగాలను లేదా పురుగు సోకిన మొక్కలను పొలం నుండి తొలగించాలి._x000D_ • సోయాబీన్ పంటను మొక్కజొన్న పంటలో అంతర పంటగా పెంచితే పురుగు యొక్క తీవ్రత ప్రధాన పంటపై తక్కువగా ఉంటుంది._x000D_ • ఒక ఎకరానికి డైమెథోయేట్ 30.00% ఇసి @ 264 మి.లీ లేదా థియామెథోక్సామ్ 12.60% + లాంబ్డా-సైహలోథ్రిన్ 09.50% జెడ్సి @ 50 మి.లీ 200 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
114
5