AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మేకలు ఎంచుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన ముఖ్యమైన పాయింట్లు
పశుసంరక్షణఅగ్రోవన్
మేకలు ఎంచుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన ముఖ్యమైన పాయింట్లు
మేకలను ఒక పశువైద్య నిపుణుడి సలహాపై కొనుగోలు చేయాలి. అది ఇప్పటికే ఒక సంతానం కలిగి ఉన్నమేకను కొనగోలు చేయడం ఉత్తమం. ● జాతిని ఎన్నుకోవడంలో, కవలల గల జాతులను పెంపొందించే మేక జాతిని కొనుగోలు చేయడమే మంచిది. వయస్సు, పిల్లల సంఖ్య, పాల పరిమాణం మొదలగు వాటిని కారకాలుగా పరిగణించాలి. పాలు ఇచ్చే మేకలు మందకోడిగా మరియు లావుగా ఉండవు.ఇది చురుకైనవిగా ఉంటాయి. ● మేకల పెంపకం విజయవంతం కావడం అనేది మేక పునరుత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది మరియు పెంపకం కోసం ఉపయోగిస్తాం కాబట్టి, మేక పెంపకానికి సరైన జాతుల మేకలను ఎంపిక చేయాలి. ● ఎంచుకున్న మేక పెద్ద శరీరమును కలిగి ఉండాలి మరియు సన్నని మెడను కలిగి ఉండాలి. తల నుండి కాలి వరకు ముఖ్యమైన లక్షణం కలిగి ఉంటుంది. జుట్టు మృదువైనదిగా మరియు మెరిసేదిగా కనిపించాలి. పెద్ద నిర్మాణ ఆకృతిని కలిగి ఉండాలి. ● సాధ్యమైనంతవరకు, ఒక సంవత్సరం లేదా రెండేళ్ళ వయస్సు గల మేకను కొనుగోలు (మరియు రెండు నుండి నాలుగు పళ్ళు ఉండాలి) చేయాలి. కాళ్ళు చక్కగా మరియు కండరాలతో ఉండాలి మరియు కాళ్లు (మడిమ) పొడవుగా ఉండాలి. బలమైన పాదాలు మేత కోసం ఎక్కువ దూరం నడవడానికి ఉపయోగపడతాయి.
ఒక మేకను కొనుగోలు చేసేటప్పుడు పొదుగు యొక్క పూర్తి తనిఖీ చేయబడాలి.ఈ పొదుగు వలన చికాకు ఉన్నదా లేదా అని చెక్ చేయాలి. పాలను ఉత్పత్తి చేసే మేక పాలను కలిగి ఉండాలి. పాల యొక్క నాణ్యత, పరిమాణం మరియు పొదుగు యొక్క వాపు ఉందో లేదో పరిశీలించాలి. పాలు పుష్కలంగా ఇచ్చే ఆరోగ్యకరమైన మేక పిల్లని కొనండి. మేక పిల్లలు ఎటువంటి వ్యాధులు లేకుండా మరియు పరాన్నజీవుల కీటకాలు లేకుండా, స్వేచ్ఛగా ఉండాలి. మూలం: ఆగ్రోవన్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
423
0