AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మిరప పంటలో తామర పురుగుల యొక్క జీవిత చక్రం మరియు దాని నియంత్రణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మిరప పంటలో తామర పురుగుల యొక్క జీవిత చక్రం మరియు దాని నియంత్రణ
తామర పురుగుల యొక్క ముట్టడిని నర్సరీలో మరియు సీజన్ అంతా మొక్కలు నాటిన పంటలో గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ ఆకు ఉపరితలాన్ని గీకి, ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. తత్ఫలితంగా, ఆకులు వంకరగా మరియు పడవ ఆకారంలో కనిపిస్తాయి. దీనిని "ఆకు ముడత" అని పిలుస్తారు.
నిర్వహణ: · వేసవిలో నర్సరీని పెంచే ముందు సాయిల్ సోలైరైజేషన్ చేపట్టండి. · నర్సరీలో విత్తనాన్ని విత్తడానికి ముందు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ ఎల్ @ 7.5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయండి. · మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ముందు, ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 10 మి.లీ లేదా థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణంలో మొక్కల వేర్లను 2 గంటలు పాటు ఉంచి నాటుకోండి. · క్రమం తప్పకుండా అంతర కృషి చేయండి. · ముట్టడి ప్రారంభ దశలో, 10 లీటర్ల నీటిలో వేప ఆధారిత సూత్రీకరణలు 20 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. · మొక్కలు నాటిన పదిహేను రోజులకు మట్టిలో కార్బోఫ్యూరాన్ 3 జి @ 33 కిలోల చొప్పున ఇవ్వండి. · తామర పురుగుల కోసం, స్పినాటోరామ్ 11.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా స్పినోసాడ్ 45 ఎస్సీ @ 3 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడి @ 3 మి.లీ లేదా థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 5 మి.లీ లేదా థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా సిహెలోథ్రిన్ 9.5 జెడ్‌సి @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద మార్చి పిచికారీ చేయండి. · తామర పురుగులతో పాటు, నల్లిని కూడా గమనించినట్లయితే, ఫిప్రోనిల్ 7% + హెక్సిథియాజాక్స్ 2% ఎస్సి @ 20 మి.లీ లేదా ప్రొఫెనోఫోస్ 40% + ఫెన్పైరోక్సిమేట్ 2.5% ఇసి @ 20 మి.లీ లేదా స్పైరోమెసిఫెన్ 22.9 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహెలోథ్రిన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్జి @ 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. · తామర పురుగులతో పాటు, పేనుబంకను గమనించినట్లయితే, డయాఫెంటియురాన్ 47% + బైఫెన్‌త్రిన్ 9.4% ఎస్సి @ 10 మి.లీ లేదా స్పిరోటెట్రామాట్ 15.31 ఓడి @ 10 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ @ 4 మి.లీ లేదా ఫిప్రోనిల్ 5 ఎస్సీ @ 20 మి.లీ లేదా మిథైల్-ఓ-డిమెటన్ 25 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
105
1