గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మామిడి పంటలో దోమ నిర్వహణ
· పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు చీలిక ఆకారంలో ఉండి చాలా వేగంగా మరియు వికర్ణంగా నడుస్తాయి. · మొక్క పుష్పించే సమయంలో ఈ పురుగుల జనాభా అకస్మాత్తుగా పెరుగుతుంది. · గుడ్లు ఉండడం వల్ల పువ్వులు ఎండిపోతాయి. · పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ అభివృద్ధి చెందుతున్న పువ్వులు మరియు ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి.
· ఆకుల ఆకారం మార్పు చెందుతుంది. · గోలి సైజులో ఉండే పండ్లు కూడా క్రింద రాలిపోతాయి. · తేనె వంటి జిగట పదార్ధం కారణంగా, నల్లటి మసి వంటి పదార్ధం అభివృద్ధి చెందుతుంది మరియు ఇది కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది. · అధిక తేమ మరియు నీడ వాతావరణం ఈ తెగులు పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. · పండ్ల తోటలో నీటి పారుదల వ్యవస్థను నిర్వహించండి. · వరద నీటిపారుదలకి బదులుగా, పురుగు జనాభాను తగ్గించడానికి డ్రిప్ పద్ధతిని అనుసరించండి. · బ్యూవేరియా బస్సియానా లేదా వెర్టిసిలియం లాకాని, అను ఫంగస్ ఆధారిత పురుగుమందులు 40 గ్రాములు 10 లీటర్ల నీటికి లేదా తెగులు ప్రారంభంలో ఏదైనా వేప ఆధారిత పురుగుమందును పిచికారీ చేయండి. · బుప్రోఫెజిన్ 25 ఎస్సీ @ 10 మి.లీ లేదా డెల్టామెత్రిన్ 2.8 ఇసి @ 3 మి.లీ లేదా లాంబ్డా సైహెలోథ్రిన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 4 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 20 ఎస్పి @ 5 గ్రాములు లేదా సైపర్‌మెత్రిన్ 10 ఇసి @ 5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. · ప్రతి స్ప్రేకి పురుగుమందులను మార్చండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
173
0
ఇతర వ్యాసాలు