గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మనగలో తెగుళ్ళ నిర్వహణ
మునగకాయ రైతులకు తక్కువ ఖర్చుతో వచ్చే పంట. అయితే, కొన్ని పురుగులు పంటను ఆశిస్తాయి. ప్రధానంగా పాము పొడ పురుగు, కాయ తొలుచు ఈగ, రసం పీల్చు పురుగులు (తెల్ల దోమ, పొలుసు పురుగు, తామర పురుగు మరియు పేనుబంక), మరియు బెరడు తినే గొంగళి పురుగు, కాండం తొలుచు పురుగు మరియు పాడ్ ఫ్లై పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో, పాము పొడ పురుగు మునగ పంటను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సమగ్ర సస్య రక్షణ పద్ధతులు: • పొలంలో దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి. • తెగులు ప్రారంభ దశలో, వేప గింజల మిశ్రమం 5% (500 గ్రా) లేదా వేప గింజల నూనె@ 10 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) పిచికారి చేయడం ద్వారా రసం పీల్చు పురుగులు మరియు గొంగళి పురుగు రెండింటినీ నియంత్రించవచ్చు. 10 లీటరు నీటికి 40 గ్రాముల ఫంగల్ బేస్డ్ పౌడర్ , వెర్టిసిలియం లాకాని లేదా బౌవేరియా బస్సియానా వంటి జీవ పురుగుమందులను కూడా ఉపయోగించవచ్చు. • పడిపోయిన మరియు పురుగు సోకిన కాయలను క్రమం తప్పకుండా సేకరించి మట్టిలో పాతిపెట్టండి. • పాడ్ ఫ్లై తర్వాత సీజన్లో కాయలను నాశనం చేయకుండా ఉండడానికి గాను రాలిన మరియు పాడైన కాయలను క్రమం తప్పకుండా సేకరించి గుంట తీసి మట్టితో కప్పి నాశనం చేయాలి. • పాడ్ ఫ్లై యొక్క ముట్టడిని తగ్గించడానికి, కాయ ఏర్పడే దశలో పైన పేర్కొన్న వేప ఆధారిత సూత్రీకరణలను పిచికారీ చేయండి మరియు మళ్ళీ 35 రోజుల తరువాత మరొక సారి పిచికారి చేయండి.
డాక్టర్ టి. ఎం. భార్పోడా,_x000D_ Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్,_x000D_ B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ,_x000D_ ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా)_x000D_ _x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
761
36
ఇతర వ్యాసాలు