AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మంచి వర్షపాతం వ్యవసాయంలో కొత్త జీవం తీసుకువస్తుంది!
కృషి వార్తది ఎకనామిక్ టైమ్
మంచి వర్షపాతం వ్యవసాయంలో కొత్త జీవం తీసుకువస్తుంది!
రుతుపవనాల వల్ల వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జలాశయాలు నీటితో నిండి ఉన్నాయి, ఖరీఫ్ పంటలను విత్తడం ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఆహార ధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత 10 సంవత్సరాలతో పోలిస్తే జలాశయాలు 25% ఎక్కువ నీటితో నిండి ఉన్నాయి. గత 30 రోజులగా విత్తకుండా ఉన్న పొలాలను ఇప్పుడు విత్తడం మొదలుపెట్టారు.ఆగస్టు చివరి నాటికి వరి విత్తడం పూర్తవుతుంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో ఆగస్టు వరకు వరి విత్తుతారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, నూనెగింజల పంట వేయడం గత సంవత్సరం మాదిరిగానే ఉంది, ప్రత్తి 5.6 శాతం ఎక్కువగా విత్తడం జరిగింది, పప్పుధాన్యాలు మరియు తృణధాన్యాలు 3.5 శాతం తక్కువ విత్తడం జరిగింది. వరి 11% తక్కువగా విత్తడం జరిగింది. ఈ వర్షం ఖరీఫ్ పంటలకు ఉపయోగపడడమే కాక, రబీ పంటలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జలాశయాలలో నీటి మట్టం చాలా బాగుంది. భూగర్భజలాల స్థాయి కూడా పెరిగింది. మంచి వర్షపాతం, ముఖ్యంగా సీజన్ చివరిలో, రబీ పంటలకు కూడా మంచిదిగా భావిస్తారు. ఇది నేలలో తేమ స్థాయిని పెంచుతుంది. మూలం - ది ఎకనామిక్ టైమ్స్, 17 ఆగస్టు 2019
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
64
0