AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
భూసార పరీక్ష కోసం మట్టి నమూనా ఎలా తీసుకోవాలి?
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
భూసార పరీక్ష కోసం మట్టి నమూనా ఎలా తీసుకోవాలి?
ఇటీ వల కాలంలో, రైతులు మట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వెల్లడయ్యింది..సేంద్రియ ఎరువులు అందుబాటులో లేకపోవడం,రసాయన ఎరువుల అసమతుల్య వినియోగం వంటివి మట్టి ఉత్పాదకతను తగ్గించేస్తున్నాయి.అందుకే ప్రతి రైతు, మట్టి నాణ్యతను ప్రతి రెండు సంవత్సరాలకు తప్పని సరిగా పరీక్షించాలి. మట్టి నమూనాను ఎలా తీసుకోవాలి? 1. మట్టి నమూనా కోత కోసిన తర్వాత కాని లేదా విత్తనం నాటే ముందు కాని మరియు రసాయనిక లేదా సేంద్రియ ఎరువులు వేసే ముందు కాని లేదా వేసిన మూడు నెలల తర్వాత కాని తీసుకోవాలి.భూసార పరీక్ష కోసం 1/2 కిలో మట్టి నమూనా అవసరం. 2. భూసార పరీక్ష కోసం, ఎకరా విస్తీర్ణంలో 8నుండి 10 చోట్ల మట్టిని అక్కడక్కడ స్వీకరించాలి. 3. నేల నమూనా తీసుకునేటప్పుడు,15 నుండి 20 సెంటీమీటర్ల వరకు "V”ఆకారంలో గొయ్యిని తవ్వి, గొయ్యికి ఒక వైపు 2 నుండి 3 సెం.మీ. మందపాటి మట్టి పొరను తీసుకోండి.
4. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8నుండి 10 చోట్ల మట్టి నమూనాలను సేకరించిన అనంతరం రాళ్లు, పుల్లలు మరియు చెత్త వంటి వస్తువుల నుండి మట్టిని శుభ్రం చేయాలి. 5. ఒక స్టీలు గిన్నెలో సేకరించిన అన్ని మట్టి నమూనాలను చక్కగా కలపండి మరియు ఒక జల్లెడ ద్వారా జల్లించండి. అప్పుడు ఒక సంచిలో అర కిలో మట్టిని తీసుకోండి. రైతు పేరు, గ్రామ పేరు,సర్వే నంబర్ ను పేపర్ మీద రాయండి.మట్టి నమూనా సంచిలో కానీ లేదా నమూనా సేకరించిన సంచి పైన ఈ పేపర్ ను ఉంచండం లేదా అతికించడం చేయండి . మట్టి పరీక్ష యొక్క ఉద్దేశం: భూసార పరీక్ష ద్వారా నేలలోని పోషక పదార్ధాల లోపాలను పరీక్షించి , ఫలితాల ఆధారంగా పంటల పెంపకం కొరకు అవసరమైన చర్యలను చేపట్టాలి. అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
21
0