AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సేంద్రీయ వ్యవసాయంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
బొటానికల్ క్రిమి సంహారిణి అయిన పొగాకు కషాయాలను ఇంట్లోనే తయారుచేయండి
• సాధారణంగా, మనం రసాయన క్రిమి సంహారకాలను తెగుళ్ల నియంత్రణ కోసం ఉపయోగించి అనేక సమస్యలను ఆహ్వానిస్తున్నాము. • ఇంట్లో తయారు చేసిన పురుగుమందులను పొలంలో తెగుళ్ల నియంత్రణకు ఉపయోగించడం వల్ల మనం తెగుళ్లను సులభంగా నియంత్రించవచ్చు. • ఈ రకమైన ఇంట్లో తయారు చేసిన పురుగుమందులను ఉపయోగించినప్పుడు మిత్ర పురుగులను సంరక్షించవచ్చు మరియు వీటి వల్ల మన పర్యావరణానికి ఎటువంటి నష్టం కలుగదు. • ఈ ప్రయోజనం కోసం, పొగాకు కషాయాలను పిచికారీ చేసి, క్రిమి తెగుళ్ల పెరుగుదలను తగ్గించండి. • పొగాకు కషాయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పొగాకు కషాయాన్ని రెండు విధాలుగా తయారు చేయవచ్చు: 1.పొగాకు కాషాయం- వేడి నీటితో తయారు చేసే విధానం: • 1 కిలో పొగాకు ఆకు పొడి / దుమ్మును 10 లీటర్ల నీటిలో 1 రాత్రి పాటు నానబెట్టాలి. • మరుసటి రోజు ఉదయం, 60 నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒక గంట ఉడకబెట్టండి. మరిగేటప్పుడు, నీటిని కలుపుతూ 10 లీటర్ల నీటి పరిమాణం ఉండేలా చూడండి. ఈ ద్రావణం ముదురు కాఫీ రంగులోకి మారుతుంది. • తర్వాత ఈ ద్రావణాన్ని కాటన్ గుడ్డలో వడకట్టి, 200 గ్రా సబ్బు పొడి లేదా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ను జోడించండి. ఈ ద్రావణంలో, 4-5 రెట్లు అదనపు నీటిని జోడించండి తర్వాత ఈ ద్రావణం స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 2. పొగాకు కాషాయం- చల్లటి నీటితో తయారు చేసే విధానం: పైన వివరించిన పద్ధతిని అనుసరించండి కాని ద్రావణాన్ని ఉడకబెట్టవద్దు. హెచ్చరిక: మీరు ద్రావణం తయారు చేసిన రోజున పిచికారీ చేయకూడదనుకుంటే, ద్రావణంలో అదనపు నీరు లేదా సబ్బు లేదా వాషింగ్ డిటర్జెంట్ పౌడర్ను జోడించవద్దు. ఈ ద్రావణాన్ని గాలి చేరని కంటైనర్లో ఉంచండి. సరైన రక్షిత వస్త్రాలు ధరించిన తరువాత ఉదయం లేదా సాయంత్రం వేళలలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేయండి. ఈ ద్రావణం పిచికారీ చేసేటప్పుడు ముక్కుకు నోటికి అడ్డుగా గుడ్డ కట్టుకోండి. పొగాకు వాసన పడనట్లయితే ఈ ద్రావణాన్ని పిచికారీ చేయరాదు. ఏదైనా మత్తుగా ఉన్నట్టు అనిపిస్తే , మందును పిచికారీ చేయడాన్ని వెంటనే ఆపివేయండి. ఈ ద్రావణాన్ని ఏ పురుగుల నియంత్రణకు ఉపయోగించవచ్చు: ఈ పొగాకు కషాయాన్ని మృదువైన శరీరం కలిగిన కీటకాల నియంత్రణకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు పేనుబంక, దోమ, తెల్ల దోమ, తామర పురుగులు, పిండి నల్లి వంటి రసం పీల్చు పురుగులు మరియు ప్రారంభ దశలో ఉన్న ఆకు తినే గొంగళి పురుగులు, పొగాకు లద్దె పురుగులు, హెలికోవర్పా, ఆకు చుట్టు పురుగు, గొంగళి పురుగులు మొదలైన పురుగుల నియంత్రణకు ఉపయోగించవచ్చు. మూలం - అగోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీడియో మూలం: డిజిటల్ గ్రీన్ ఓఆర్జి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
262
0