AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బఠానీ పంటలో సమగ్ర సస్య రక్షణ మరియు బఠానీ పంటలో వచ్చే తెగుళ్లు
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
బఠానీ పంటలో సమగ్ర సస్య రక్షణ మరియు బఠానీ పంటలో వచ్చే తెగుళ్లు
పేనుబంక: మొక్క యొక్క మృదువైన భాగాల నుండి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రసాన్ని పీల్చడం ద్వారా ఈ పురుగులు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పురుగు యొక్క దాడి తరువాత, ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి, ఇది మొక్క యొక్క పెరుగుదల మరియు దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
నిర్వహణ:_x000D_ 1. పేనుబంక కనిపించిన మొక్క మరియు మొక్క యొక్క ఇతర భాగాలను విచ్ఛిన్నం చేయండి._x000D_ 2. ఎకరానికి 1 లీటరు వేప నూనె 1500 పిపిఎమ్ 200 లీటర్ల నీటిలో కలిపి 10 రోజుల విరామంలో మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ 3. అదనపు వ్యాప్తి జరిగితే, థియోమిథోక్సామ్ 25% డబుల్ల్యు జి @ 40 గ్రాములు / ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ పాము పొడ పురుగు: మొక్క పెరుగుదల దశలో ఈ పురుగు మరింత హానికరం. ఈ పురుగు ఆకులలో ఒక సొరంగం చేస్తుంది మరియు ఆకులోని ఆకుపచ్చ భాగాలను తినడం ద్వారా మొక్కను నాశనం చేస్తుంది._x000D_ నిర్వహణ:_x000D_ 1. ఈ తెగులు నియంత్రణకు 4% వేప విత్తన పొడి(40 గ్రాముల వేప విత్తన పొడి లీటరు నీటికి) చల్లడం ప్రయోజనకరంగా ఉంటుంది._x000D_ 2. పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నప్పుడు, ఎకరానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 17.8% ఎస్ ఎల్ @ 40 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి లేదా థియోమిథాక్సామ్ 25% డబుల్ల్యు జి @ 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ బఠానీ పంటను ఆశించే వ్యాధులు _x000D_ _x000D_ బూజు తెగులు: కాండం, ఆకులు మరియు కాయలు ఈ వ్యాధి బారిన పడుతాయి. వ్యాధి ఆశించిన భాగాలలో మరకలు ఏర్పడతాయి, తరువాత ఇవి తెల్లటి పొడిగా మారుతాయి మరియు ఇవి ఒకదానితో ఒకటి విలీనం అవుతాయి మరియు క్రమంగా మొత్తం ఆకు మరియు మొక్క తెల్లటి పొడితో కప్పబడి తరువాత ఆకులు రాలిపోతాయి._x000D_ నిర్వహణ:_x000D_ 1. యాంటీ బాక్టీరియల్ రకాలను ఎంచుకోండి._x000D_ 2. పురుగు ముట్టడి ప్రారంభంలో, ఎకరానికి సల్ఫర్ 80% డబుల్ల్యుజి @ 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ _x000D_ ఎండు తెగులు: ఇది బఠానీ పంటలో వచ్చే ఫంగల్ వ్యాధి. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగులోకి మారుతాయి మరియు మొక్క ఎండిపోతుంది._x000D_ నిర్వహణ:_x000D_ 1. ఈ వ్యాధి నివారణకు, థైరామ్ @ 2 గ్రాములు + కార్బెండజిమ్ 1 గ్రాము కిలో విత్తనానికి లేదా ట్రైకోడెర్మా @ 4 గ్రాములు + బిటావాక్స్ 2 గ్రాములు / కిలో విత్తనానికి కలిపి విత్తనం విత్తడానికి ముందుగా విత్తన శుద్ధి చేయాలి._x000D_ 2. వ్యాధి నిరోధక రకాలను ఎన్నుకోవాలి._x000D_ 3. పంటలో ఈ వ్యాధి నివారణకు గాను, కార్బెండజిమ్‌ 50% డబుల్ల్యుపి @ 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు వేర్ల దగ్గర ఇవ్వాలి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_
193
0