AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బంగాళదుంప పంటలో సమగ్ర సస్య రక్షణ:
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
బంగాళదుంప పంటలో సమగ్ర సస్య రక్షణ:
బంగాళదుంప పంటలో ప్రధాన తెగుళ్ళు_x000D_ •పేనుబంక: తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రొండు ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి, దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి._x000D_ •నిర్వహణ: థియామెథోక్సామ్ 25% డబుల్ల్యుజి @ 40 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో మొక్కల మీద పిచికారి చేయండి. _x000D_ •వేరు పురుగు: ఈ పురుగు బంగాళదుంప మొక్కలను మరియు కొమ్మలను మరియు పెరుగుతున్న దుంపలను కత్తిరిస్తుంది; తరువాతి దశలో పురుగు దుంపలను నాశనం చేస్తుంది, ఇది దుంపల మార్కెట్ ధరను తగ్గిస్తుంది. ఈ కీటకం రాత్రి సమయంలో పంటను పాడు చేస్తుంది._x000D_ •నిర్వహణ: క్లోరోపైరిఫోస్‌ను 20% ఇసి @ 2 మి.లీ/ లీటరు నీటికి కలిపి మట్టిని తడిపివేయడం._x000D_ బంగాళదుంప పంటలో వచ్చే ప్రధాన వ్యాధులు_x000D_ •ఎర్లీ బ్లయిట్: ఈ తెగులు ఆశించినప్పుడు, దిగువ ఆకులపై చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఆకులపై ఈ తెగులు వ్యాపించడం జరుగుతుంది, దీనివల్ల ఆకులు నాశనమవుతాయి._x000D_ •నిర్వహణ: ఎకరానికి మాంకోజెబ్ 75% డబుల్ల్యుపి @ 500 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 25% డబుల్ల్యుపి @ 400 గ్రాములు లేదా ప్రొపినెబ్ 70% డబుల్ల్యుపి @ 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ •లేట్ బ్లయిట్: ఈ వ్యాధి యొక్క లక్షణాలు మొదట దిగువ ఆకులపై లేత ఆకుపచ్చ మచ్చల రూపంలో కనిపిస్తాయి, ఇవి త్వరలో గోధుమ రంగులోకి మారుతాయి. ఈ మచ్చలు అక్కడక్కడా ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణంలో ఇవి చాలా వేగంగా వ్యాపించి ఆకులను నాశనం చేస్తాయి. ఆకుల అంచులు మరియు ఆకుల కొసలు ఎండిపోవడం వంటివి ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. _x000D_ •నిర్వహణ: ఎకరానికి మాంకోజెబ్ 75% డబుల్ల్యుపి @ 500 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 25% డబుల్ల్యుపి @ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_ _x000D_
86
0