గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఫ్రూట్ ఫ్లై ట్రాప్ ను సిద్ధం చేయండి
ఫ్రూట్ ఫ్లై యొక్క ముట్టడిని జామకాయ, సపోటా, మామిడి మరియు ఇతర పండ్ల తోటలలో గమనించవచ్చు. ఫ్రూట్ ఫ్లై పెట్టిన గుడ్ల నుండి లార్వా ఉద్భవించి, పండులోకి ప్రవేశించి, అంతర్గత భాగాలను తింటుంది. కొన్నిసార్లు, పండ్లు ఇలా దెబ్బతినడం వల్ల కుళ్ళిపోతాయి. పురుగు ఆశించిన పండ్లు పరిపక్వానికి రావు మరియు నెల మీద రాలిపోతాయి. పండ్ల దిగుబడి మరియు నాణ్యత క్షీనిస్తుంది, మార్కెట్ లో వీటి ధర బాగా తగ్గుతుంది మరియు వీటిని విదేశాలకు ఎగుమతి చేయలేరు. పంట సాగును శుభ్రంగా చేయాలి, రాలిన పండ్లను సేకరించి నాశనం చేయాలి, మార్కెట్లో లభించే మిథైల్ యూజీనాల్ ప్లై వుడ్ బ్లాక్స్ (2 ”x 2”) ఉచ్చులను చెట్లపై సమాన దూరంలో హెక్టారుకు 16 చొప్పున ఏర్పాటు చేయాలి. అయితే, ఈ రకమైన ఉచ్చులను తక్కువ ఖర్చుతో ఇంటి వద్ద సులభంగా తయారు చేయవచ్చు.
ఉచ్చులను తయారుచేసే విధానం: · మిథైల్ యూజీనాల్ 20 మి.లీ, డైక్లోర్వోస్ 76 ఇసి లేదా క్వినాల్ఫోస్ 25 ఇసి @ 2 నుండి 3 చుక్కలు మరియు ఒక లీటరు నీరు తీసుకొని ఒక ద్రావణం తయారు చేయండి. స్పాంజి ముక్కను తీసుకొని ఈ ద్రావణంలో ముంచండి. చికిత్స చేయబడిన స్పాంజిని రెండు వైపులా 2.5 సెంటీమీటర్ల డైయామీటర్ కలిగిన గుండ్రంగా కట్ అయ్యి ఉన్న ప్లాస్టిక్ కూజాలో ఉంచండి. ఇప్పుడు ఉచ్చు సిద్ధంగా ఉంది. · భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో చెట్టు మీద ఈ ఉచ్చులను హెక్టారుకు 16 చొప్పున ఏర్పాటు చేయండి. · మిథైల్ యూజీనాల్‌కు బదులుగా, నల్ల తులసి ఆకుల సారం (1 లీటరు నీటిలో 500 గ్రాముల నల్ల తులసి ఆకులను ఉంచి గ్రైండర్ సహాయంతో రుబ్బండి, అప్పుడు సారం సిద్ధంగా అవుతుంది) కూడా ఉపయోగించుకోవచ్చు. · ప్రతి 2 నుండి 3 రోజులకు ఉచ్చులో ఆకర్షించబడిన ఫ్రూట్ ఫ్లైలను తీసివేసి మరల స్పాంజిని ద్రావణంతో రీఛార్జి చేయండి. · అదనంగా, పండ్ల తోట చుట్టూ నల్ల తులసి మొక్కలను పెంచండి మరియు డైక్లోర్వోస్ 76 ఇసి @ 10 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 25 ఇసి @ 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. విషపు ఎరను కూడా పిచికారీ చేయవచ్చు. విషపు ఎర తయారీకి, బకెట్‌లో 10 లీటర్ల నీరు తీసుకొని 500 గ్రాముల బెల్లం లేదా ప్రోటీన్ హైడ్రోలైజేట్ 300 గ్రాములు వేసి కొంత సమయం వరకు ఉంచండి. ఈ ద్రావణంలో, డైక్లోర్వోస్ 76 ఇసి 10 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 25 ఇసి 20 మి.లీ వేసి బాగా కలపండి. ఈ ద్రావణాన్ని ఆర్చర్డ్ సరిహద్దులతో పాటు గడ్డి / పొదలు మరియు సంధ్యా సమయంలో చెట్లపై కోర్స్ స్ప్రే చేయండి. పండ్లు నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు మందు పిచికారీ చేయాలి మరియు 15 రోజుల విరామంలో దీనిని 2-3 సార్లు పిచికారీ చేయవచ్చు. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
158
1
ఇతర వ్యాసాలు