AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఫాస్పరస్ సాల్యుబ్యులైజింగ్ బ్యాక్టీరియాతో ప్రయోజనాలు
సేంద్రీయ వ్యవసాయంఅగ్రోవన్
ఫాస్పరస్ సాల్యుబ్యులైజింగ్ బ్యాక్టీరియాతో ప్రయోజనాలు
అప్లై చేయు విధానం: • విత్తన చికిత్స కోస 10 కిలోల విత్తనాలను 25 గ్రాముల పి.ఎస్.బి.తో కలపండి; మరియు ఇది ఆరిన తరువాత నీడలో ఉంచి, విత్తడం ప్రారంభించవ్చచు. • 1 లీటరు నీటిలో 3 నుంచి 5 మి.లీ.ల పి.ఎస్.బి. ని కలపండి; టమాటాలు, ఉల్లిపాయలు మరియు మిరప వంటి నాట్లను ఈ మిశ్రమంలో 15 నిమిషాల పాటు ముంచి ఉంచండి. ఆ తరువాత మాత్రమే నారు నాటడం చేయాలి. • 200 లీటర్ల నీటిలో 1 లీటరు పి.ఎస్.బి. ని కలపండి. దీనిని తప్పనిసరిగా డ్రిప్ విధానంలో పంటపై చల్లాలి.
ప్రయోజనాలు: • భాస్వరంలో కరిగే బ్యాక్టీరియా (ఫాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా) ఫలితంలా 30 నుంచి 450 కేజీల భాస్వరం అందుబాటులోకి వస్తుంది. • పండ్లు మరియు కూరగాయల పంట దిగుబడి పెరుగుతుంది. • ఉత్పత్తి పెరుగుదల 20 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. • భాస్వరంతో పాటు పలు రకాల హార్మోన్‌లు అందుబాటులో ఉండడంతో మిరప, ఉల్లి, టమోటాలు, వంగ మరియు ఇతర పంటల నాణ్యత పెరుగుతుంది. • సిఫార్సు చేసిన విధంగా ఫాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఉపయోగించడం కారణంగా, మట్టి కాలుష్యం తగ్గుతుంది మరియు సారం నిర్వహించబడుతుంది. సందర్భం - ఆగ్రోవన్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
317
2