AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
అగ్రి జుగాడ్మై కిసాన్ దోస్త్
పొలానికి యూరియా ఇవ్వడానికి గాను ఉత్తమ పరికరం
• మొదట 1 అంగుళం మరియు 1.25 అంగుళాల పరిమాణంలో 2 పైపులను తీసుకోండి. • పరికరం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు- మార్కర్, రెండు క్లిప్లు, వాలుగా ఉన్న చెక్క ముక్క, రబ్బరు, స్ప్రింగ్, బేసిన్ పైపు, , టి ఆకారపు జాయింట్ మొదలైనవి తీసుకోండి. • 1.25 అంగుళం పైపుకు ఒక వైపు త్రికోణం ఆకారంలో మరియు మరొక వైపు దీర్ఘచతురాకారంలో గీసి తర్వాత పైపును ఆ ఆకారంలో కోయండి. • 1 అంగుళం పైపుపై కూడా త్రికోణం ఆకారాన్ని కత్తిరించి ఈ రెండు పైపులను జత చేయండి. • తర్వాత పైపు క్రింద భాగంలో వాలుగా ఉన్న చెక్క ముక్కను ఉంచండి. చెక్క వదులుగా ఉంటే, సెల్లో టేప్‌ను చుట్టండి. • 1.25 అంగుళాల పైపుకు క్లిప్‌ను జత చేయండి మరియు దానిని బోల్ట్ తో గట్టిగా బిగించండి. బోల్ట్ బిగించేటప్పుడు రబ్బరును కూడా జత చేయండి. ఆ వెంటనే క్లిప్ యొక్క చివరలో ఒక శీల పెట్టి దానిని రబ్బరుతో బిగించండి. • పైపు దిగువ భాగంలో ఒక మూత ఉంచండి. బేసిన్ పైపును మరొక చివర ఉంచండి మరియు దీనిని సెల్లో టేప్ తో బిగించండి. • ఎరువులు సులభంగా వేయడానికి వీలుగా బ్యాగ్‌ను తయారు చేయండి. ఆ సంచిలో ఒక మూలలో రంధ్రం చేసి, మరొక మూతను అక్కడ ఉంచి దానికి బేసిన్ పైప్ ను జోడించండి. మూలం: మై కిసాన్ దోస్త్ ఈ వ్యవసాయ పరికరం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ పొలంలో ఇలాంటి వ్యవసాయ పరికరాలను ఉపయోగిస్తుంటే, ఖచ్చితంగా వాటిని అగ్రోస్టార్ అప్లికేషన్ లో మిగతా రైతు సోదరులకు షేర్ చేయండి.
459
3